
Murliwale Hausla Snake Viral Video: సోషల్ మీడియాలో ఇటీవల ఒక నాగుపాము కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మురళీవాలే హౌస్లా షార్ట్స్ (Murliwale Hausla Shorts) అనే యూట్యూబ్ ఛానెల్ నుంచి షేర్ చేసిన ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. సాధారణంగా చాలామంది నేటిజన్స్ ఈ వీడియోను మొబైల్స్‌లో నుంచి చూసి కూడా భయపడుతున్నారు. కొంతమంది ఈ వీడియోని కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది? పాము వీడియో ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ వీడియోలో.. ఓ ఇంట్లో ఉన్న ఇటుక గోడలో సంచారం చేసిన నాగుపా మును రక్షించడానికి ఓ యువ స్నేక్ క్యాచర్ అహసోపేతంగా ధైర్యంగా ముందుకెళ్ళిన ఘటనను మీరు కళ్ళకు కట్టినట్లు చూడొచ్చు. ఈ వీడియోలో ఆ వ్యక్తి ఇటుకలను పగలగొట్టి మరి గోడలోని ఏమాత్రం ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా తన చేతిని ఓడ లోపలికి పెట్టి.. అందులో నుంచి అతి కష్టం మీద పాములు బయటికి తీశాడు. అయితే ఇలా తీసే క్రమంలో ఆ పాము అతడి చేతి వేళ్లను కాటేసి ఎందుకు ప్రయత్నించింది.. అయితే, తను దీనిని ముందుగానే గమనించి సేఫ్టీగా చేతికి గ్లౌజులు ధరించడం మీరు చూడొచ్చు. ఇలా ఆ పామును ఓ డబ్బాలో బంధించి.. సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టారు. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలే వైరల్‌గా మారాయి..
ఈ వీడియోలో ఆ పాముని రక్షించింది ఎవరో కాదు ప్రముఖ స్నేక్ క్యాచర్ మురళీవాలే.. ఆయన ఇలా రక్షిస్తున్న పాములకు సంబంధించిన వీడియోలను మురళీవాలే హౌస్లా షార్ట్స్ పోస్ట్ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్ నుంచి వీడియోలను పోస్ట్ చేస్తూ ఉన్నారు.. చాలామంది ఈ వీడియోలో అతడు ధైర్యంగా ఆ పామును పట్టుకోవడం చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది ఈ వీడియోను చూసి కామెంట్లు కూడా చేస్తున్నారు. ఒక్కొక్క సోషల్ మీడియా వినియోగదారు ఒక్కొక్కల వారి అభిప్రాయాలను పంచుకుంటున్నారు..
పాములు పర్యావరణ వ్యవస్థలో క్రియాశీలక పాత్ర పోషిస్తాయని కొంతమంది పర్యావరణ నిపుణులు తెలుపుతున్నారు. ఇలా జనావాసాల్లో సంచారం చేసే పాములను రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని.. పాములు కనిపిస్తే తప్పకుండా అటవీశాఖ అధికారులతో పాటు స్నేక్ క్యాచర్స్‌కి సమాచారం అందించాలని వారు తెలిపారు. అంతేకాకుండా పాములు పట్టడంలో నైపుణ్యం కలిగిన వారు వాటిని రక్షించి సురక్షితమైన అంతాలో వదిలిపెట్టాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి