Two Cobras Video: వామ్మో.. సంభోగంలో ఉన్న నాగుపాములను పట్టుకున్న స్నేక్ క్యాచర్.. వీడియో ఇదే..

Two Cobras Video Watch: ఓ వ్యక్తి అత్యంత ప్రమాదకరమైన రెండు నాగుపాములను ఒకే చోట పట్టుకుంటున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో ఆ వ్యక్తి అత్యంత ప్రమాదకరమైన నాగుపాములను చాకచక్యంగా పట్టుకోవడం మీరు చూడొచ్చు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 26, 2025, 12:26 PM IST
Two Cobras Video: వామ్మో.. సంభోగంలో ఉన్న నాగుపాములను పట్టుకున్న స్నేక్ క్యాచర్.. వీడియో ఇదే..

Two Cobras Video Watch: సోషల్ మీడియాలో ఇప్పుడు సాహసంతో పాటు ఉత్కంఠ కలగలిపిన ఓ ఆసక్తికరమైన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి పొదల్లో ఆటలాడుతున్న రెండు అత్యంత ప్రమాదకరమైన నాగుపాములను బయటకు తీయడానికి చేసిన సాహస ప్రయత్నం హైలైట్‌గా మారింది. సాధారణంగా రెండు ఒకే చోట ఉన్న పాములను పట్టుకోవడం చాలా కష్టమైనప్పటికీ.. ఈ వీడియోలో యువకుడి ఎంతో చాకచక్యంగా వాటిని పట్టుకొని రక్షించే ప్రయత్నం చేశాడు. అతడి ధైర్యాన్ని చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

Add Zee News as a Preferred Source

వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ గ్రామంలోని పొదల్లో రెండు పాములు ఒకే చోట ఆడుతున్నట్లు గమనించి స్థానికులు అంతా స్నేక్ క్యాచర్‌కి సమాచారం అందిస్తారు. దీంతో అక్కడికి వెంటనే ఓ స్నేక్ క్యాచర్ చేరుకుంటాడు. చేరుకొని దగ్గరికి వెళ్లి ఆ రెండు పాములను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తాడు. అయితే, రెండు పాములు సంభోగంలో భాగంగా ఒకటినొకటి చుట్టుకోగా.. ఆ యువకుడు ముందుగా వాటి తోకలను పట్టుకుంటాడు. అయితే ఈ సమయంలో ఆ పాములు వాటి బిజీలో అవి ఉండడంతో అతన్ని ఏమీ అనలేకపోతాయి. అంతేకాకుండా దాడి చేసే ప్రయత్నం కూడా చేయవు..

ఈ సమయంలో ఆ వ్యక్తి ఎటువంటి పరికరాలు వినియోగించకుండా ఆ పాములను పట్టుకోవడం చూసి స్థానికులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాకుండా ఆ రెండు పాములు అత్యంత ప్రమాదకరమైనవని తెలిసినప్పటికీ.. స్నేక్ క్యాచర్ తన వీధిలో భాగంగా ఆ రెండు పాములను ఎంతో సులభంగా రెస్క్యూ చేయగలిగాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియో చూసిన చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ వ్యక్తి ఏంటి అలా ఉత్తి చేతులతోనే అత్యంత ప్రమాదకరమైన రెండు పాములను పట్టుకుంటున్నాడని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను ఓ యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News