)
Two Cobras Snake Video Watch: ఇటీవల యూట్యూబ్‌లో పాములకు సంబంధించిన వీడియోలే ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. చాలామంది ఇలాంటి వీడియోలనే ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే పాములను పట్టుకునే క్రమంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసే సోషల్ మీడియాలో మురళివాలే హౌస్లా ఛానల్ ఒకటి. ఈ ఛానల్ నుంచి పోస్ట్ చేసే ప్రతి వీడియో సోషల్ మీడియాలో మిలియన్స్ వ్యూస్ సంపాదించుకుంటుంది. అంతేకాకుండా చాలామంది ఈ వీడియోలను ఎంతో ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు. తాజాగా యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ అయిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సహజంగా పాములు మానవునివాసాలకు దూరంగా నివసించేందుకు ఇష్టపడుతూ ఉంటాయి. కానీ కొన్ని జాతులకు సంబంధించిన పాములు మాత్రమే అప్పుడప్పుడు మానవ నివాసాలకు దగ్గరగా వస్తూ ఉంటాయి. అందులో కింగ్ కోబ్రా జాతికి సంబంధించిన పాములు ఒకటి. ఈ పాములు ఎక్కువగా సురక్షితంగా ఉండే ప్రదేశాలతో పాటు అలికిడి ఉండే ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇందులో భాగంగానే రెండు పాములకు సంబంధించిన జంట జనావాసాల మధ్యలోకి వచ్చింది. ఇప్పుడు ఈ పాములను రెస్క్యూ చేసే క్రమంలోనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.
మురళివాలే హౌస్లా తన బృందం కలిసి ఓ గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు అక్కడికి చేరుకుంటారు. రెండు పాములను రెస్క్యూ చేసేందుకు వారి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఇందులో భాగంగానే ఈ వీడియో ప్రారంభమవుతుంది. వీడియో వివరాల్లోకి వెళ్తే.. ముందుగా ఓ స్నేక్ క్యాచర్ ఒకచోట ఓ కాటన్ దుస్తును తీసి.. చూడగా అక్కడ అతనికి రెండు నాగుపాములు కనిపిస్తాయి. ఆ పాముల తోకలను పట్టుకుని రెస్క్యూ చేసేందుకు అందులో నుంచి వాటిని బయటికి తీస్తారు.
అయితే, ఈ సమయంలో ఆ రెండు పాములు అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తాయి. చాకచక్యంగా ఆ పాముల నుంచి తప్పించుకుంటాడు. నెమ్మదిగా అతను ఆ రెండు పాములను ఒక కాటన్ సంచిలో బంధించి సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లి వదిలేస్తాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే వైరల్ గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను రెండు మిలియన్లకు పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. అంతేకాకుండా 74,000 మంది లైక్ చేసినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి