
Man playing with big king cobra snake video: పాముల వీడియోలకు ఇటీవల సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ నడుస్తొంది. నెటిజన్లు పాముల వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తికనబరుస్తున్నారు. అడవుల్లో, గుబురుగా ఉండే మొక్కలు ఉన్న చోట పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. స్నేక్ ల వీడియోలను నెటిజన్లు ఎక్కువగా వైరల్ చేస్తున్నారు. చాలా మంది పాములు కన్పించగానే వెంటనే.. స్నేక్ సొసైటీ వాళ్లకు కాల్ చేసి సమాచారం ఇస్తారు. కానీ మరికొందరు మాత్రం.. పాములను చూడగానే భయంతో దూరంగా పారిపోతారు.
అసలు మళ్లీ ఆ ప్రదేశంకు అస్సలు వెళ్లడానికి కూడా సాహాసం చేయరు. మొత్తంగా పాములకు ఆపద కల్గించకూడదని మరికొందరు చెబుతుంటారు. పాముల్ని చంపితే.. కాలసర్పదోషం చుట్టుకుంటుందని..అందుకే దాన్ని అసలు విడిచిపెట్టారు. పాములు ఎక్కడైన కన్పిస్తే.. వెళ్లిపొవాలని దండం పెట్టుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం నెట్టింట ఒక భారీ నల్లని కింగ్ కోబ్రా సర్పం తెగ హల్ చల్ చేస్తుంది. పాములంటేనే జనాలు భయంతో వణికిపోతుంటారు.
అలాంటిది నల్లని సర్పం, అది కూడా కింగ్ కోబ్రా అంటే ఇంకేమైనఉంది.. జనాలకు చుచ్చు పడిపోతుంది. అయితే.. ఒక వ్యక్తి ఏ మాత్రం భయంలేకుండా.. నల్లని కింగ్ కోబ్రాను తన చేతిలో పట్టుకుని రచ్చ రచ్చ చేశాడు. దానితో వీడియోలు, ఫోటోలు తీసుకుంటున్నాడు. ఆ సర్పం కూడా ఫోటోలకు భలే ఫోజులు ఇచ్చింది.
దాని ముందర ఉన్నవాళ్ల మీద మాత్రం పలు మార్లు కాటు వేయడానికి అన్నట్లు కోపంగా వెళ్లింది. అతను మాత్రం కనీసం తన చేతిలో ఎలాంగి గ్లౌజులు లేకుండానే పామును పట్టుకుని మరీ దానితో విన్యాసాలు చేశాడు.అంతటితో ఆగకుండా.. తన ఘనకార్యంను వీడియో రూపంలో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఆ వీడియోలు కాస్త నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం బాబోయ్.. వీడియో చూస్తేనే పాము ఇంత భయంకరంగా ఉంది.. రియల్ గా కళ్లముందుకు వస్తే.. అంతే సంగతులు అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.