12 Feet King Cobra Viral Video: క్రమంగా వైల్డ్ యానిమల్స్ భూమిపై తగ్గుతూ వస్తున్నాయి. దీని కారణంగా పర్యావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా అడవుల్లో జంతువులు ఎలా తగ్గుతూ వస్తున్నాయో..వీటితో సమానంలో పాములు కూడా అలాగే తగ్గుతూ వస్తున్నాయి. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని స్నేక్ క్యాచర్స్ ఆడవుల్లో నుంచి తప్పిపోయి, జనావాసాల్లోకి వస్తున్న పాములను పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లోకి తరలిస్తున్నారు. ఇప్పటి వరకు స్నేక్ క్యాచర్స్ కొన్ని లక్షల పాములను సురక్షితంగా రక్షించారు. కొంతమంది పాములు పట్టేవారు వీటి కాటు బారిన పడి ఆసుపత్రుల్లో కూడా చేరారు. అయినప్పటికీ ఈ వృత్తి వదలకుండా కొనసాగిస్తూనే వస్తున్నారు. తెలుగు స్నేక్ క్యాచర్ వైల్డ్ వెంకట్ (Wild Venkat) కూడా ఇదే కోవకు చెందినవారు.
ప్రముఖ స్నేక్ క్యాచర్ వైల్డ్ వెంకట్ (Wild Venkat) ఇటీవలే ఓ అరుదైన కింగ్ కోబ్రా పామును పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో యూట్యుబ్‌లో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా వీరభద్ర పేట గ్రామంలో కొంతమంది కొబ్బరి రైతులు ఓ పెద్ద కింగ్ కోబ్రాను చూసి వెంకట్‌కి కాల్ చేస్తారు. దీంతో ఆయన వెంటనే అక్కడి చేరుకుంటారు. అక్కడికి చేరుకోగానే కొంతమంది రైతేలు పాము చెట్టుపై ఉందని చెప్పడంతో స్నేక్ క్యాచర్ పెద్ద చెట్టుపై ఉన్న పామును కింది తీసుకువచ్చేందుకు, కట్టే సహాయంతో కింది లాగే ప్రయత్నం చేస్తారు.
ఆ కింగ్ కోబ్రా వెంటనే కింది రావడంతో స్నేక్ క్యాచర్ వెంకట్ దాని తోకను పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఎంతో కోపంతో ఉన్న ఆ పాము ఆతన్ని కాటేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇలాగే పాము దాదాపు రెండు నుంచి మూడు సార్లు దాడి చేందుకు యత్నిస్తుంది. ఆ స్నేక్ క్యాచర్ కూడా ఎంత సులభంగా దాని నుంచి తప్పించుకుంటారు. అయితే చివరికి వెంకట్ ఆ పామును పట్టుకుని, ఇతర స్నేక్ క్యాచర్ సహాకారంతో సంచిలో బంధిస్తారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని వెంకట్ సొంత యూట్యుబ్ చానెల్ @Wild Venkat అనే ఖాతా నుంచి షేర్ చేశారు.
ఈ పట్టుకున్న కింగ్ కోబ్రాను వైల్డ్ వెంకట్ బరువు కొలిచే మిషన్‌పై ఉంచగా.. దాదాపు 8 కీలోల బరువు ఉన్నట్లు తెలింది. అంతేకాకుండా ఈ పాము దాదాపు 12 అడుగులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ పామును చూసేందుకు చాలా మంది గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. అయితే వెంకట్ వారికి అడికి పాముకు సంబంధించిన చాలా విషయాలు తెలుసుకున్నారు. అలాగే దీనిని చూసిన నెటిజన్స్ వారి అభిప్రాయాలు కామెంట్స్ కూడా చేస్తున్నారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









