)
Snake chasing and attacks on frog Trending video: పాముల వీడియోలు తరచుగా నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. పాములకు గద్దలు, ముంగీసలు, నెమళ్లు అంటే కట్టర్ శత్రువులు. అంతే కాకుండా ఎలుకల, కప్పలు అంటే మాత్రం చెప్పలేనంత ఇష్టం. వీటిని తినేందుకు ఎంతొ ఇష్టపడతాయి. కప్పలు, ఎలుకల నుంచి ఒక రకమైన స్మెల్ ను పాములు గ్రహిస్తాయంట.
— Damn Nature You Scary (@AmazingSights) October 2, 2025
అందుకే ఎంత దూరంలో ఉన్న పాములు వీటిని ఇట్టే పసిగట్టేస్తాయంటారు. ముఖ్యంగా పాములు ఎక్కువగా చెట్లు, కొండ ప్రాంతాలు, పంట పొలాల్లో ఎక్కువగా సంచారం చేస్తాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు పాములు కప్పల్ని, ఎలుకల్ని వేటాడుతుంటాయి. ఇలాంటి వీడియోలు ఇటీవల ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.
తాజాగా.. ఒక పాము కప్పను స్పీడ్ గా వెంబడిస్తుంది. ఇంతలో కప్ప పామును చూసి దాని కంటే స్పీడ్ గా వెళ్లేందుకు దాని శక్తిని మొత్తంగా కూడగట్టుకునిముందుకు వెళ్తుంది. కోబ్రా నోటికి చిక్కకుండా దాన్ని ముప్పు తిప్పలు పెట్టింది. చెట్లలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నించింది. కానీ ఏమైందో కానీ.. కప్ప మాత్రం చివరకు పాము శక్తిముందు లొంగిపోయింది.
పాము దాన్ని బలంగా కాటేసి, నోట్లో కరుచుకుని చుట్టేసుకుంది . మొత్తంగా పాముకు కప్ప పాపం.. ఆహారం అయిపోయింది. ఈ ఘటను అక్కడున్న వారు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook