Snake dancing on road and flying like bird ai video: సోషల్ మీడియాలో ప్రతిరోజు కుప్పలు తెప్పలుగా వీడియోలు వైరల్గా మారుతున్నాయి. కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యంకు గురిచేస్తే, మరికొన్ని వీడియోలు చూస్తే బిత్తరపోయేలా ఉంటాయి. ముఖ్యంగా పాముల వీడియోలకు నెట్టింట బాగా డిమాండ్ పెరిగింది. దీంతో నెటిజన్లు కోబ్రాల వీడియోలను చూసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది ఏఐ ఫెక్ వీడియోలను కూడా వైరల్ చేస్తున్నారు.
అసలు ఏవి ఓరిజినల్ వీడియోలో.. మరేవి ఏఐ వీడియోలో కూడా అర్థం కానీ సిట్యువేషన్ ఏర్పడింది. ప్రస్తుతం ఒక నాగు పాము వీడియో వైరల్గా మారింది. పాము నడి రోడ్డు మీద డ్యాన్స్ చేస్తు హల్ చల్ చేస్తుంది. అది మెలికలు తిరిగిపోతూ.. డ్యాన్స్ చేసింది. ఇంతలో అది అచ్చం పక్షిలా ఆకాశంలో ఎగిరింది. అటు ఇటు తిరుగుతూ పైకి ఎగిరిపోయింది.
ఈ ఘటనకు చెందిన వీడియో బాగా వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలు పాము ఇలా మెలికలు తిరుగుతూ డ్యాన్స్ చేయడం ఏంటని షాక్ అవుతున్నారు.
మరికొంత మంది ఇటీవల పాములు కూడా అప్ డేట్ అయ్యాయా.. ఏంటని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా ఈ పాముల వీడియో నిజమైనది కాదని.. ఏఐ ఫెక్ వీడియో అంటూ కూడా తెలిసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం బాగా వైరల్గా మారింది.









