)
Snake Found In Cauliflower: వర్షాకాలం మొదలైతే చాలు, చాలామందికి వేడివేడి వంటకాలు గుర్తుకొస్తాయి. చల్లని వర్షాకాలంలో వేడివేడి పకోడీలు తినాలనిపిస్తుంది. ఈ మధ్య ట్రెండింగ్ గా చెప్పాలంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మంచూరియా ఇష్టంగా తింటున్నారు. మంచూరియాని క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌తో చేస్తారు. కానీ, కొన్నిసార్లు వాటితో తయారు చేసిన మంచూరియాలు తినడం ప్రాణాంతకమే. ఎందుకంటే పొలాల్లో పండించే కూరగాయలు కావున.. అక్కడుంటే పాము పిల్లలు క్యాబేజీ, క్యాలీఫ్లవర్లోకి దూరుతున్నాయి.
వాటిని శుభ్రం చేసి కట్ చేసే సమయానికి ఆ పాములు, పురుగులు బయటకు వచ్చి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రజలను తీవ్రంగా ఆలోచించేలా చేస్తుంది. ఎందుకంటే వీడియోలో ఓ క్యాలిఫ్లవర్ లోపల రెండు పాము పిల్లలు బయటకొచ్చాయి. కూర కోసం కట్ చేసే లోపు అందులో నుంచి పాము పిల్లలు రావడం వల్ల అక్కడున్న వారు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఒకవేళ వాటిని చూడకుండా కట్ చేసి ఉంటే.. ఎంతో మంది ప్రాణాలతో చెలగాటం ఆడినట్లు అయ్యేది.
వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉన్న కారణంగా పొలాల్లో పాములు, క్రిమికీటకాలు వంటివి తిరుగుతుంటాయి. నీరు నిలబడడం వల్ల ఆవాసాలను వెతుక్కుంటూ పాములు వస్తాయి. వాన ధాటికి పాములు క్యాలిఫ్లవర్,క్యాబేజి, బ్రకోలి వంటి వాటిలో దూరతాయి. ఇదే విధంగా ఆ రెండు పాములు క్యాలిఫ్లవర్లోకి దూరి ఉండొచ్చు. అదే విధంగా రైతులు క్యాలిఫ్లవర్ ను కట్ చేసి మార్కెట్‌కు పంపి ఉంటారు. దీంతో అప్పటివరకు బయటకు రాని పాములు ఒక్కసారిగా పాము పిల్లలు బయటకు రావడంతో ఇక ఆ క్లాలీఫ్లవర్ తినేందుకు ధైర్యం చేయరు.
ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రజలకు ఇదొక ఉదాహరణగా నిలుస్తుంది. క్యాలీఫ్లవర్ ను వండే ముందు వాటిలో క్రిమికీటకాలు లేదా ఇతర పురుగులు ఉన్నాయో లేదో అనేది ముందుగా తనిఖీ చేసుకున్న తర్వాత మార్కెట్ నుంచి ఇంటికి తీసుకురావాలి. లేదంటే ఇంట్లో అలాంటివి బయటకి వచ్చినా.. పెద్ద ఇబ్బంది అయిపోతుంది. ఇకపై కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లే వారు ఇలాంటి జాగ్రత్తలు తప్పక తీసుకోండి.
ఏం చేస్తే మంచిది?
ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే.. ఇంట్లో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చిన వెంటనే వాటిని శుభ్రం చేయాలి. ముఖ్యంగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి వాటిని ఉప్పు లేదా బేకింగ్ సోడాతో వేడి నీటిలో సుమారు 10 నిమిషాల పాటు నానబెట్టి తర్వాత శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల వాటిలో ఉన్న పురుగులు బయటకు వస్తాయి. ఆ తర్వాత ఈ కూరగాయలను తినేందుకు రెడీ చేసుకోవచ్చు. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లాంటివి కాకుండా ఇతర
కూరగాయలను కూడా చూసి కొనుగోలు చేయడం ఉత్తమం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook