)
Snake Found in LED TV Video: ఓ ఇంట్లోని LED టీవీ లోపల నుండి వింత శబ్దాలు వస్తున్నాయి. అందులో ఏమైనా బల్లి దూరిందేమో అని ఆ ఇంట్లో వాళ్లు అనుకున్నారు. కానీ, అంతలోనే ఆ టీవీ ఊడదీసి చూడగా అందులో మెలికలు తిరుగుతూ ఓ విషపూరితమైన పాము కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
పాములు అంటే మనలో చాలా మందికి చచ్చేంత భయం ఉంటుంది. కొందరు పాముని చూసినా, అటుగా వెళ్తుందని ఎవరైనా చెప్పినా దానికి ఆమడదూరంగా వెళ్తారు. అంతటి భయంకరమైన పాములు ఇటీవలీ కాలంలో ఇంటి ఆవాసాల్లోకి వస్తున్నాయి. అందులోనూ వర్షాకాలం కావడం వల్ల పాముల బెడద భయంకరంగా పెరిగిపోతుంది. భారీ వర్షాల కారణంగా పాములు ఇప్పుడు ఇళ్లలోకి వచ్చి చేరుతున్నాయి. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ విషపూరితమైన పాము ఇంట్లోని LED టీవీలోకి దూరింది. టీవీలో నక్కి ఉండడం చూసిన ఆ ఇంటి వాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఆ పామును ఉందని ఎలా తెలిసింది? దాన్ని బయటకు ఎలా తీశారు? అనే విషయాలు ఈ వీడియో చూస్తే తెలుస్తోంది.
ఇంట్లోని LED స్మార్ట్ టీవీలోకి ఓ పాము దూరింది. ఆ టీవీలో నుంచి వింత శబ్దాలు రావడం ఆ ఇంట్లో నివసించే వారు గమనించారు. ఒకటి, రెండు సార్లు అంతగా పట్టించుకోలేదు. కానీ, విచిత్రమైన శబ్దాల కారణంగా దాని గురించి తప్పకుండా తెలుసుకోవాలని టీవీని బయటకు తీసి చూసేందుకు ప్రయత్నించారు. అయితే అందులో ఓ విషపూరితమైన పాము పిల్ల ఉండడం చూసి ఆ కుటుంబసభ్యులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
ఆ పాము ఎక్కడి నుంచి వచ్చిందో? దాన్ని ఎలా బయటకు పంపాలో? అంటూ భయపడుతున్న క్రమంలో.. వారిలో ఓ వ్యక్తి పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చాడు. అంతలో పాములు పట్టే వ్యక్తి వచ్చి.. ఎల్ఈడీ టీవీని ఓపెన్ చేసి చూసేందుకు ప్రయత్నించాడు. వెనుక ఉన్న డోమ్ తీయగానే.. చిన్నని పాము పిల్ల ఒకటి బయటపడింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.
నాగేంద్ర అనే ఫేస్బుక్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేసి ఉంది. బల్లలు లేదా పురుగులు తినేందుకు ఆ పాము టీవీలోకి దూరి ఉంటుందని ఆ పామును పట్టడానికి వచ్చిన వ్యక్తి చెప్పాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. అయితే అది ఎక్కడ జరిగిందనే విషయంపై స్పష్టత లేదు. అయితే ఇప్పుడీ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. టీవీలో పాము దూరడం ఇదే తొలిసారి అని కామెంట్స్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook