Snake Giving Birth Viral Video: నట్ట నడి రోడ్డుపై ప్రసవించిన పాము.. పిల్లలు ఎలా ఉన్నాయో చూస్తారా? ఈ వీడియో మీకోసమే..

Snake Giving Birth To Babies Full Video Viral: Today  ప్రస్తుతం ఓ పాము నేరుగా రోడ్డుపై పిల్లలకు జన్మనివ్వడానికి సంబంధించిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ పాములు ఇలా కూడా పిల్లలు చేస్తాయని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియో మీరు చూశారా? 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 3, 2025, 09:46 AM IST
Snake Giving Birth Viral Video: నట్ట నడి రోడ్డుపై ప్రసవించిన పాము.. పిల్లలు ఎలా ఉన్నాయో చూస్తారా? ఈ వీడియో మీకోసమే..

Snake Giving Birth To Babies Full Video Watch Now: మనం ఇప్పటికీ చూసిన పాములన్ని ఒకే ఆకృతిని కలిగి ఉండడం గమనించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పాముల జాతులు మూడు వేలకు పైగానే ఉన్నాయి. అందులో కొన్ని మనుషులకు హాని కలిగించే వైతే మరికొన్ని విషపూరితమైనవి కావు.. ఇన్ని జాతుల పాముల్లో ఒక్కొక్క పాము ఒక్కొక్క విధంగా పునరుత్పత్తిని చేస్తుంది. అంతేకాకుండా పాములల్లో మగ పాములు ఆడ పాములు కూడా ఉంటాయి. అలాగే కొన్ని పాములు గుడ్లు పెట్టి పిల్లలు చేస్తే మరికొన్ని పాములు నేరుగా పిల్లలకు జన్మనిస్తాయి.  అయితే మీరు ఎప్పుడైనా పాము గుడ్ల ద్వారా కాకుండా నేరుగా జన్మించడం చూశారా? ఇలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇటీవలే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పాములు నేరుగా వాటి పిల్లలకు జన్మనివ్వడం చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఈ వైరల్ అవుతున్న వీడియో ఏంటో? పాము ఎలా పిల్లలకు జన్మనిచ్చిందో ఇప్పుడు తెలుసుకోండి. 

Add Zee News as a Preferred Source

పాములు నేరుగా పిల్లలకు జన్మనివ్వడానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. దీనిని చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వీడియో వివరాల్లోకి వెళితే.. నడి రోడ్డు పైన ఓ పెద్ద పాము తన చిన్న చిన్న పిల్లలకు జన్మనివ్వడం ఈ వీడియోలో మీరు గమనించవచ్చు. అంతేకాకుండా అప్పుడే తన తల్లి పొట్టలో నుంచి బయటికి వచ్చిన పిల్లలు కూడా అటూ ఇటూ పాకడం మీరు చూడవచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఎంతగానో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు అనేక రకాలుగా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోకి 2.74 కోట్ల మంది వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొంతమంది లైక్ కూడా చేశారు. 

అలాగే ఆ పామును చూసేందుకు చాలామంది రోడ్డుపైనే వాహనాలను ఆపి కొద్దిసేపటి దాకా పిల్లలకు జన్మనివ్వడం దగ్గర నుంచి చూశారు. అయితే ఈ సన్నివేశాలను అక్కడే ఉన్న కొంతమంది చిత్రీకరించి యూట్యూబ్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో అక్కడి నుంచి ట్విట్టర్లో, ఆ తర్వాత ఇంస్టాగ్రామ్ లో ఇలా అన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫస్ట్ టైం చూసిన కొంతమంది నెటిజన్స్ ఈ వీడియో పై అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.. కొంతమంది అయితే" పాము ఇలా కూడా చేస్తుందా?.. నేరుగా పాము పిల్లలకు జన్మనివ్వడం నేను ఈ వీడియోలో మొదటిసారి చూస్తున్నానని" సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే ఇలాంటి అరుదైన వీడియోలు షేర్ చేసినందుకు ధన్యవాదాలు కూడా తెలుపుతున్నారు.

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News