)
Snake Vs Mongoose Fight: పాములను చూస్తే మనలో చాలా మందికి భయం. మనకే కాదు అడవిలోని క్రూర జంతువులు కూడా భయంకరమైన పాములకు భయపడతాయి. అలాంటి విషపూరితమైన పాములు కాటేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోతాయి. దీంతో అలాంటి విషపూరితమైన పాములకు క్రూర మృగాలు కూడా భయపడక తప్పదు. కానీ, ఒకడు తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నే వాడు ఇంకొకడు ఉంటాడు అనేది సామెత. ఇదే సామెత పాముకు సరిపోతుంది. పాముకు ఎంతమంది భయపడినా.. ఆ పాముకు ముంగిసలు అంటే చచ్చేంత భయం అంట. అలాంటి ముంగిసలు ఎలాంటి విషపూరిత పాములకైనా చెమటలు పట్టిస్తాయట.
మనుషుల్లో చాలా మందికి పాములంటే చచ్చేంత భయం. పాము ఉందని తెలిస్తే చాలు కిలోమీటరు దూరం పరిగెత్తుతారు. పాములకు వన్య ప్రాణులు కూడా భయపడతాయి. విష సర్పాలకు ఎంతటి వారైనా భయపడతారు.అలాంటి పాముకు ముంగిసలు చెమటలు పట్టిస్తాయి. ఎక్కడైనా ఈ రెండు ప్రాణాలు ఎదురు పడితే కచ్చితంగా పెద్ద యుద్ధమే జరుగుతుంది. నిత్యం ఇలాంటి యుద్ధాలు ఎన్నో జరుగుతాయి. కానీ, ప్రతిసారి ఏది గెలుస్తుందో అని చాలా మందికి ఆసక్తి ఎక్కువ. ఇప్పుడు అలాంటి ఓ వీడియో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ప్రకారం.. పాము, ముంగిస విపరీతంగా కొట్లాడుతున్నాయి. పాము, ముంగిసల మధ్య జరిగిన భారీ పోరాటంలో పాము కాటు నుంచి తప్పించుకునేందుకు ముంగిస భలే టెక్నిక్ ఉపయోగించింది. కానీ, ముంగిస పట్టుకు పాము దొరికిపోయింది. చాలా సేపు ముంగిస పట్టు వదలకపోవడంతో పాము ఏమి చేయలేని పరిస్థితికి వెళ్లింది. కానీ, అంతలోనే ముంగిస పట్టు నుంచి బయటకొచ్చిన పాము.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నించింది.
కానీ, దాని వెంటే వెళ్లిన ముంగిస.. పాముని పలుమార్లు దాడి చేయసాగింది. ముంగిస దెబ్బకి పాము అక్కడి నుంచి పారిపోతున్నా.. ముంగిస దాన్ని వెంటాడుతూ వేధిస్తుంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన చాలా మంది విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు 60 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే రెండు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు తమ కామెంట్స్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook