Snake Repellents: సాధారణంగా వర్షాకాలం, వేసవికాలాల్లో పాముల భయం ఎక్కువగా ఉంటుంది. పాము కాటు కేసులు కూడా ఈ సీజన్‌లో ఎక్కువగా నమోదవుతుంటాయి. అయితే కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా పాములు ఇంటి పరిసరాల్లో రాకుండా నిరోధించవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
వేసవి వచ్చిందంటే చాలు ఎండల వేడి, అధిక ఉష్ణోగ్రతల కారణంగా పాములు కలుగుల్లో ఉండలేక బయటికొచ్చి చల్లని నీడ ఉండే ప్రదేశాల్లోకి వస్తుంటాయి. ఈ క్రమంలో పొలాల్లో, ఇళ్లలో, ఇంటి పెరట్లో, తోటల్లో దూరి తలదాచుకుంటాయి. ఆ క్రమంలో ఎవరైనా అటు వెళ్తే అవి ఆత్మ సంరక్షణకై కాటేస్తుంటాయి. అందుకే వేసవిలో పాము కాటు కేసులు ఎక్కువగా ఉంటాయి. పాము కాటు మరణాలు కూడా ఎక్కువగా ఉంటుంటాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో అవలంభించే కొన్ని పద్ధతులతో ఇంటి పరిసరాల్లోకి పాములు రాకుండా నిరోధించవచ్చు. ముఖ్యంగా వేపాకులు, వెల్లుల్లి, వేప నూనె, ఉల్లి ఘాటు వాసనలతో పాముల్ని దూరంగా ఉంచవచ్చు. ఘాటైన వాసనలు ఉండే చోటికి పాములు రావడానికి ఇష్టపడవు. అందుకే వేపాకులు పాముల్ని నియంత్రించేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి.
పాముల్ని ఇంటి పరిసరాల్లో రాకుండా ఉండేందుకు ఇంటి పెరట్లో, తలుపులు, కిటికీలకు వేపాకులు కట్టడం లేదా చల్లడం చేయాలి. తోటలు, పొలాల్లో వేపాకుల్ని కాల్చడం వల్ల పాములు దరిదాపుల్లోకి రావు. ఎందుకంటే వేప పొగ వీటికి పడదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పద్ధతి చాలా కాలంగా వాడుకలో ఉంది. వేపాకుల్ని మెత్తగా నూరి నీటిలో కలిపి ఆ నీటిని ఇంటి చుట్టూ చల్లితే పాములు ఇంట్లోకి రాలేవు. వేపనూనెను ఓ గుడ్డకు రాసి ఇంటి మూలల్లో ఉంచినా పాములు ఇంట్లోకి ప్రవేశించలేవు.
వేపాకులే కాకుండా వెల్లుల్లి, ఉల్లిపాయల వాసన కూడా పాములకు పడదు. వెల్లుల్లి, ఉల్లి రసాన్ని ఇంటి మూలల్లో చల్లితే పాములు దరిదాపుల్లో ప్రవేశించలేవు.
Also read: AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాలు ఎప్పుడు, వాట్సప్ ద్వారా మార్క్స్ మెమో ఎలా తీసుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









