)
Snake rescuer died after cobra snake bites video: వానాకాలంలో పాము బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా దట్టమైన చెట్లు, గుట్టలు ఉన్న ప్రదేశంలో పాములు ఎక్కువగా సంచారం చేస్తాయి. పాములు కన్పిస్తే చాలా మంది స్నేక్ క్యాచర్ లకు సమాచారం ఇస్తారు. కొంత మంది పాముల్ని పట్టుకుని రకరకాల స్టంట్ లకు దిగుతారు. కానీ కొన్నిసార్లు కోబ్రాల్ని పట్టే క్రమంలో పాము కాటుకు గురైన ఘటనలు కూడా ఉన్నాయి.
మూగ జీవాల్ని కాపాడాలని వచ్చిన వారు దాని కాటుకే బలైన ఘటనకు చెందిన వీడియో వైరల్‌గా మారింది. స్థానికంగా ఒక ప్రాంతంలో పెద్ద నాగుపాము కన్పించడంతో వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే అతను రంగంలోకి దిగి పబ్లిక్‌గా అందరు చూస్తుండగానే చాకచక్యంగా పామును పట్టుకున్నాడు. అది ఎంత ఇబ్బందులు పెట్టిన కూడా కోబ్రాను అస్సలు వదల్లేదు. మొత్తంగా పామును జాగ్రత్తగా, ఎంతో చాకచక్యంగా పట్టుకున్నాడు.
ఇంతలో ఆ పాము అతని నుంచి తప్పించుకుని ఒక్కసారిగాచేతి వేళ్ల మీద కాటు వేసింది. దీంతో అతను షాక్ కు గురయ్యాడు. ఆ తర్వాత మెల్లగా పామును ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేయడానికి ప్రయత్నించాడు కానీ అప్పటికే విషం అతని శరీరంలోకి వెళ్లింది. అతను అందరుచూస్తుండగానే కుప్పకూలీ పడిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు చెప్పారు. మొత్తంగా పామును కాపాడదామని వచ్చిన స్నేక్ క్యాచర్ దాని కాటుకే బలైన ఘటన వార్తలలో నిలిచింది. ఈవీడియోను చూసిన నెటిజన్లు పాముని పట్టుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. అతనికి బహుశా అంత ఎక్స్ పీరియన్స్ లేదేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.