)
Snake Rescuer narrowly escaped from king cobra attack: అడవులు, కొండలు ఉన్న ప్రదేశంలో పాములు ఎక్కువగా సంచారం చేస్తారు. ముఖ్యంగా అవి వానాకాలంలో ఎలుకల వేటలో జనావాసాల్లోకి వస్తాయి. అంతేకాకుండా దట్టమైన చెట్లు, జలపాతాలు ఉన్న చోటు పాములు, కొండ చిలువలు ఎక్కువగా సంచరిస్తాయి. వానాకాలం వచ్చిందంటే చాలు పాముల కాటు ఘటనలు కూడా తెగ టెన్షన్ పెట్టిస్తుంటాయి.
పాములల్లో కింగ్ కోబ్రా చాలా డెంజర్గా ఉంటుంది. ఇతర పాముల్ని ఇది చంపేసి తింటుంది. దీని విషం వేగంగా నాడీ వ్యవస్థ, మెదడుపై పనిచేస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక భారీ కింగ్ కోబ్రా జనావాసాల్లోకి వచ్చింది. డెహ్రడూన్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
డెహ్రడూన్ లోని ఝజ్రా రేంజ్లోని భావువాలా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. భారీ సర్పం స్థానికంగా ఉన్న ఒక చెట్టు మీద ఎక్కి కూర్చుంది. దీన్ని అక్కడి గ్రామస్థులు గమనించి వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫారెస్ట్ అధికారులు, స్నేక్ టీమ్ లు రంగంలోకి దిగాయి. కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు ట్రై చేశారు. ఈ క్రమంలో అది వైలెంట్ గా దాడి చేసింది.
కింగ్ కోబ్రా అత్యంత వేగంగా దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించిన అటవీ సిబ్బందిపై దాడికి దిగింది. ఆ తర్వాత అక్కడ కింద పడి తప్పించుకునేందుకు ప్రయత్నించింది.
కొన్ని గంటల పాటు శ్రమించి స్నేక్ టీమ్ ఆ కింగ్ కోబ్రాను బంధించారు. ఆ తర్వాత దగ్గరలోని అడవిలో తీసుకెళ్లి వదిలేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బాబోయ్ ఎంత డెంజర్ గా ఉందని కామెంట్లు చేస్తున్నారు.