Snake sits on back side of a bike video viral: ఇటీవల పాముల రకారకాల వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు బాగా ఆసక్తితో చూస్తున్నారు. అందుకే ఎక్కడ పాములు కన్పించిన వెంటనే తమ ఫోన్ లలో రికార్డులు చేసి సోషల్ మీడియాలోపోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా పాములు ఇంట్లో బెడ్ షిట్ లలో, బూట్లలో దూరిపోతున్నాయి. అంతే కాకుండా.. అవి కిచెన్ లలో, చీకటిగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఇవి మొత్తంగా చాలా భయంకరంగా ఉంటున్నాయి. పొరపాటున నెగ్లీజెన్సీగా ఉంటే కాటు వేస్తున్నాయి.
చాలా మంది కోబ్రాలు కన్పిస్తే వెంటనే స్నేక్ సొసైటీవారికి సమాచారం ఇస్తారు. కానీ మరికొంతమంది మాత్రం పాములు కన్పిస్తే దూరంగా పారిపోతారు. మరల అక్కడకు అస్సలు పొరు. ఇప్పుడైతే మరీ ఒక పాము ఏకంగా బైక్ ఎక్కి బుసలు కొడుతుంది. ఇప్పటి వరకు అనుకొకుండా బైక్ లో దూరిన పాములు, ఆతర్వాత అక్కడి నుంచి వెళ్లిపొయిన ఘటనలు చూశాం.
మరీ ఇదికాస్త స్పెషల్ గా ఉంది. మరీ దీనికి బైక్ రైడింగ్ అంటే ఇష్టమో తెలీదు కానీ మొత్తంగా కోబ్రా బుసలు కొడుతూ బైక్ వెనక సీట్లో కూర్చుంది. చాలా సేపు అది అక్కడ బైక్ వెనక సీటింగ్ రాడ్ ను పట్టుకుని కూర్చుంది. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదెక్కడి కోబ్రారా నాయన అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పాములకు హనీ కల్గించకూడదని పండితులు చెబుతారు. దీని వల్ల కాలసర్పదోషం చుట్టుకుంటుందని, ఆర్థిక సమస్యలువస్తాయని, జీవితంలో ఎదుగుదల ఉండదని చెబుతారు. అందుకే కోబ్రాలు కన్పిస్తే అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయి స్నేక్ క్యాచర్ లకు సమాచారం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.









