Snake sitting on ceiling fan video: ఇటీవల పాములు ఎక్కువగా జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇంటి చుట్టుపక్కల దట్టమైన చెట్లు, చెరువులు ఉంటే అక్కడ పాములు ఉంటాయి. ఎలుకలు ఉన్న కూడా కోబ్రాలు అక్కడే తిష్టవేసుకుని కూర్చుంటాయి. ఇటీవల పాముల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నెటిజన్లు కూడా వీటిని బాగా ఆసక్తితో చూస్తున్నారు. అందుకు ఎక్కడ ఎలాంటి పాములు కన్పించిన వెంటనే చాలా మంది తమఫోన్ లలో రికార్డులు చేసి వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు.
దీంతో అది కాస్త వైరల్గా మారుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఒక పాము ఏకంగా ఇంట్లోని బెడ్ రూమ్ లో ఫ్యాన్ మీద ఎక్కి హల్ చల్ చేసింది. అది చాలా సేపు బుసలు కొడుతూ అక్కడే ఉండిపోయింది. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.
ఒక పాము ఇంట్లోకి ప్రవేశించింది. అది ఏంచక్కా.. బెడ్ రూమ్ లోకి దూరిపోయి ఫ్యాన్ మీదకు ఎక్కి కూర్చుంది.మరీ దానికి హయిగా అన్పిస్తుందో ఏంటో కానీ మొత్తంగా ఆ పాము మాత్రం చాలా జాగ్రత్తగా ఫ్యాన్ ను చుట్టుకుని కూర్చుంది. దాన్ని కుటుంబ సభ్యులు చూశారు. వెంటనే దాన్ని కిందకు పడగొట్టే ప్రయత్నం చేశారు. అది కదలకుండా అక్కడే కూర్చుంది.
Read more: Elephant Video: అయ్యో పాపం.. కొండపై నుంచి రోడ్డు మీద జారీ పడ్డ భారీ ఏనుగు.. వీడియో వైరల్...
బుసలుకొడుతూ దాడికి రెడీ అన్నట్లు ప్రవర్తించింది. మొత్తంగా కోబ్రా ఫ్యాన్ కు చుట్టుకున్న వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఆ తర్వాత స్నేక్ క్యాచర్ వచ్చి దాన్ని బంధించి దగ్గరలోని అడవిలో వదిలేశాడు. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.మరీ ఇదెక్కడి రచ్చర బాబు అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరీ పాము అక్కడకు ఎలా వెళ్లిందని కొంత మంది డౌటానుమానంవ్యక్తం చేస్తున్నారు.









