Snake stands on tail in soil video: ఇటీవల కాలంలో పాముల వీడియోలు ఎక్కువగా ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ముఖ్యంగా పాములు అడవులు, చెట్లు, ఎలుకలు ఉన్న ప్రదేశంలో ఎక్కువగా ఉంటాయి. పాములు రాత్రిపూట సంచరిస్తాయి. చాలా మంది అనుకున్నట్లు పాములు మనుషుల ఆవాసాలకు దగ్గరగా ఉండేందుకు అస్సలు ఇష్టపడరు. మనం నడుస్తున్నప్పుడు భూమిలో నుంచి తరంగాలను పాములు గ్రహించే గుణం కల్గి ఉంటాయి. ఇదిలా ఉండగా.. పాముల్ని కన్పించగానే చాలా మంది భయంతో పారిపోతారు.
అసలు పాములు ఉన్న ప్రదేశంలో పొరపాటున కూడా వెళ్లేందుకు సాహసంచేయరు. ఈ క్రమంలో పాములు కన్పిస్తే కొంత మంది కొట్టిచంపుతుంటారు. మరికొందరు పాములను దూరంగా నుంచి చూస్తారు. పాములకు హనీ కల్గజేస్తే.. కాలసర్పదోషం చుట్టుకుంటుందంటారు. అంతేకాకుండా.. దీని వల్ల వైవాహిక జీవితంలో, భవిష్యత్తు ఉద్యోగంలో, చికాకులు ఏర్పడతాయి. అందుకే చాలా మంది పాముల జోలికి అస్సలు పోరు. ఇక మరోవైపు పాముల వీడియోలు ఇటీవల ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఒక పాము నడి రోడ్డు మీద తన తోక మీద నిలబడి మరీ బుసలు కొడుతుంది. ఆ మార్గంలో వెళ్తున్న ఒక వ్యక్తి సడెన్ గా పాములు చూసి షాక్ అయ్యాడు. వెంటనే అతను తన ఫోన్ తీసుకుని మరీ పామును దూరం నుంచి దాని కదలికలను బంధించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. బాబోయ్.. పామేంటీ కాటేయడానికి రెడీగా ఉందని కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా పాములు నడిరోడ్డు మీద బుసలు కొడూతూ.. కాటు వేస్తా అన్నట్లు కూడా సిద్దంగా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.









