)
Snake Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది ఎవర్ని అయినా వణికించే వీడియో. ఈ వీడియోలో ఒక యువకుడు భారీ పామును పట్టుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ పాము సాధారణ పాము కాదు, కానీ ప్రపంచంలోనే అతి పొడవైన, అత్యంత విషపూరితమైన పాము, మలేషియా కింగ్ కోబ్రా. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ వీడియోను నేచర్ ఈజ్ అమేజింగ్ @AMAZlNGNATURE ద్వారా X ఖాతాలో షేర్ చేశారు. "ఇది మలేషియా కింగ్ కోబ్రా. భూమి మీద అతి పొడవైన విషపూరిత పాము. ఇది కింగ్ కోబ్రా వివిధ ఉపజాతులలో కూడా పొడవైనది. మగ పాములు 17 అడుగుల నుంచి 18 అడుగుల వరకు ఉంటాయి" అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేశారు.
కింగ్ కోబ్రా దాని పొడవుకు మాత్రమే కాకుండా, దాని తెలివితేటలు, ప్రాణాంతక విషం, ప్రత్యేకమైన వేట కూడా ఇది ఫేమస్. ప్రత్యేకత ఏమిటంటే ఈ పాము ఇతర పాములను కూడా తింటుంది. అందుకే దీనిని 'పాముల రాజు' అని పిలుస్తారు. ఈ పాము చాలా విషపూరితమైనది, అది ఏనుగును కూడా చంపగలదు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మలేషియా కింగ్ కోబ్రా విషం చాలా శక్తివంతమైనది. అది కొన్ని గంటల్లోనే పెద్ద ఏనుగును కూడా చంపగలదు. అయితే, ఈ పాము మానవులపై సులభంగా దాడి చేయదు. మనుషులు ఎవరైనా బెదిరించినా, చంపేందుకు ప్రయత్నించి సందర్భాల్లో మాత్రమే ఇది దాడి చేస్తుంది. ఆడ కింగ్ కోబ్రా కూడా తన గుడ్లను రక్షించుకోవడానికి గూడు కట్టుకుంటుంది. తన పిల్లల్ని కాపాడుకునేందుకు ఆడపాము కూడా ఎంతో దూకుడుగా ఉంటుంది.
This is a Malaysian King Cobra. The longest venomous snake on the planet. It is the longest of the different subspecies of King Cobra, as well. Adult males can possibly reach up to 17ft to 18ft (5m). pic.twitter.com/GpuztXp9LB
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) August 15, 2025
మలేషియా కింగ్ కోబ్రా తూర్పు మలేషియాలో కనిపిస్తుంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము, ఇది 5-6 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. కింగ్ కోబ్రాస్ సాధారణంగా మనుషులపై దాడి చేయవు. బెదిరింపులు లేదా చంపడానికి ప్రయత్నించిన సమయాల్లో ఇది దాడి చేస్తుంది. ఇది ఒక రకమైన సౌండ్ చేసుకుండూ వస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook