)
Snake Videos Viral: ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల జాతుల పాములు ఉన్నాయి. వాటిలో కొన్ని అత్యంత విషపూరితమైనవి. మరికొన్ని అంతగా విషపూరితమైనవి కావు. మనకు తెలిసిన పాముల్లో నల్లత్రాచు లేదా నాగపాము అత్యంత విషపూరితమైన పాములుగా గుర్తించారు. వాటి విషంతో ఎన్నో రసాయనాలు తయారు చేస్తున్నారు. అంతే కాకుండా నల్లత్రాచు కాటేస్తే నిమిషాల్లో మరణం సంభవిస్తుంది. అందుకే నాగుపాములను ఎక్కడ చూసినా జనాలు పారిపోతుంటారు. కానీ, అన్నీ పాములు విషపూరితమైనవి కావు కానీ, అన్నీ పాములు ప్రమాదకరమైనవి. పాము జాతుల్లో అనకొండ, కొండచిలువ లాంటి పాములు అంతగా విషపూరితమైనవి కావు. కానీ, ఆ రకమైన పాములు బలంతో కదలకుండా ఒత్తిడి పెట్టి చంపే అవకాశం ఉంది.
సాధారణంగా పాములు ఇతర జంతువులు, మనుషుల మీద దాడులు చేస్తుంటాయి. కానీ, పాములు వాటిలో అవే చంపుకొనే సంఘటనలు అరుదు. కానీ, అలాంటి సంఘటనే ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ఓ నాగుపామును కొండచిలువ జాతికి చెందిన పాముతో భీకర యుద్ధం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఓ నాగుపామును కొండచిలువ గట్టిగా చుట్టేస్తుంది. ఎంత ప్రాణి అయినా కొండచిలువ లాంటి ఉడుం పట్టు నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అలాంటిది నాగుపాము కూడా కొండచిలువ బారి నుంచి తప్పించుకోవడం కష్టంగా మారింది. కొండచిలువ చుట్టేసి బలవంతంగా ఒత్తిడి చేస్తున్న క్రమంలో నాగుపాము కోరలు కూడా బయటకి వచ్చినంత పనైంది.
— Damn Nature You Scary (@AmazingSights) September 4, 2025
ఈ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేయగా దీనికి ఇప్పటికే 6 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ 53 సెకన్ల నిడివి ఉన్న వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పాములు కొట్లాడుకోవడం చూడడం ఇదే తొలిసారి అంటున్నారు. కానీ, పాములు చంపుకొనేంత పోరాడడం ఇదే తొలిసారి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook