)
Snake Viral Video: సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ నల్ల పాము ఒక వ్యక్తిపై దాడి చేసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. వ్యక్తిపై పాము దాడి చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో పాముతో సరదాగా ఓ వ్యక్తి ముద్దాడేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో నల్లత్రాచు పాము ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. వ్యక్తి ముఖాన్ని విచక్షణా రహితంగా కొరికి భయంకరమైన గాట్లు పెట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని వణికిస్తుంది.
ఏం జరిగిందంటే?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి చేతిలో భయంకరమైన నల్లత్రాచు పామును పట్టుకున్నాడు. మరోవ్యక్తి పామును పట్టుకున్న వ్యక్తిని వీడియో రికార్డు చేస్తున్నాడు. పాము పట్టుకొని ఫొటోకి ఫోజులు ఇస్తున్న ఆ వ్యక్తి సడెన్‌గా దాన్ని ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే అంతలోనే ఆ విషపూరిత నల్లత్రాచు పాము అతడి ముఖంపై కాటు వేసింది.
ఎంతో బలవంతంగా ఆ పాముని పట్టుకున్నా.. దాని నోటితో నల్లత్రాచు పాము గట్టిగా అతడి ముఖంపై కాటు వేసింది. పామును సరదాగా పట్టుకున్న వ్యక్తి దాన్ని ముద్దాడేందుకు ప్రయత్నించాడు. బహుశా అక్కడున్న వాళ్లంతా మద్యం మత్తులో ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే వారు మద్యం మత్తులో పామును ముద్దాడబోయాడనే అనే అనుమానం వ్యక్తం అవుతుంది. పాముని పట్టుకున్న వ్యక్తి ముఖం నిండా పాము తన విషపూరితమైన కోరలతో గాట్లు పెట్టడం వల్ల అతను ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. భయంకరమైన పాముతో ఫొటో తీసుకోవడమే గొప్ప. ఇతను పామును ముద్దుపెట్టుకోవాలని ప్రాణం మీదకి తెచ్చుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ప్రాణాంతక జంతువులతో సరదా కూడా చేటే అంటూ సూచిస్తున్నారు. ఏదీ ఏమైనా ఈ వీడియో ఎప్పటిదో కానీ, తెగ వైరల్ అవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook