)
Snake Viral Video: సోషల్ మీడియాలో తరచూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో భయంకరమైన పాములు తెగ ట్రెండ్ అవుతుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ భయంకరమైన కొండచిలువ వీడియో ఉలిక్కిపడేలా చేస్తుంది. ఓ పెద్ద పాము పెంపుడు జంతువులా తోక ఊపుకుంటూ వచ్చిన వీడియో నెటిజన్లను షాక్ కు గురిచేస్తుంది. ఇంతకీ ఏం జరిగిందో ఒక్కసారి చూడండి.
సాధారణంగా నీటిలోకి విహారం లేదా చేపలు పట్టేందుకు వెళుతుంటారు. కొన్నిసార్లు చేపలకు బదులు పెద్దపెద్ద పాములు కూడా వలలో పడుతుంటాయి. వాటిలో ఎక్కువగా కొండచిలువలు నీటి అడుగున ఎక్కువగా ఉంటాయి. అయితే దట్టమైన అడవులున్న ప్రాంతాల్లో ఉండే నీటిలో కచ్చితంగా భయంకరమైన కొండచిలువలు ఉంటాయనేది వాస్తవం.
అలాంటి ఆవాసాల్లో చేపలు, తిమింగళాలను, మొసళ్లు ఉంటే వాటిని కూడా మింగేసే శక్తి ఈ కొండచిలువకు ఉంది. అలాంటి కొండచిలువకు దొరికితే అదే చివరిరోజు. వాటిని దూరం నుంచి చూసినా పైప్రాణాలు పైకే పోతాయి. కానీ, వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం ఓ వ్యక్తి పామును పెంపుడు జంతువులా చూసుకుంటున్నాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు షాక్ కు గురయ్యారు.
వైరల్ అయిన వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి ఓ పడవలోని గుర్తుతెలియని ప్రాంతంలో వెళుతూ ఉన్నాడు. పడవలో షికారుకు వెళ్తున్న వ్యక్తికి ఎదురుగా సడెన్ గా ఏదో వింత జంతువు వస్తున్నట్లు కనిపిస్తుంది. దాన్ని వీడియో రికార్డింగ్ చేసే ప్రక్రియలో అది పాము అని తెలిసింది. వెంటనే దాన్ని పెంచుతున్న వ్యక్తి లాగా అతను పామును దగ్గరకు పిలిచాడు. అదే పాము అతని దగ్గరకు వచ్చి.. ఎంతో చక్కగా ప్రేమగా కనిపించింది. దాంతో ఆ వీడియో ఎండ్ అయిపోయింది.
అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా మంది షాక్ అవుతున్నారు. పామును ఆ వ్యక్తి పెంపుడు జంతువును పిలిచినట్లు ఉండే వీడియో తెగ వైరల్ అవుతోంది. విచిత్రం ఏంటంటే ఆ వ్యక్తి పామును పిలవగానే ప్రేమగా వచ్చినట్లు అయ్యింది. ఈ వీడియో చూసి ఇది క్రియేటెడ్ వీడియో అని కామెంట్ చేస్తుండగా.. ఆ పాము పెంపుడు జంతువు అయ్యిండొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఈ భయంకరమైన పామును చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook