Snake Viral Video: వామ్మో.. బైక్ నడుపుతున్న యువకుడి చేతిను చుట్టేసిన పాము.. వీడియో..

Snake Wrapped Young Man Hand Video: తాజాగా సోషల్ మీడియాలో ఓ యువకుడు బైక్‌ను ఒక చేతితో నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోలో ఇంకో చేతికి పాము చుట్టుకుని ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 7, 2025, 01:18 PM IST
Snake Viral Video: వామ్మో.. బైక్ నడుపుతున్న యువకుడి చేతిను చుట్టేసిన పాము.. వీడియో..

Snake Wrapped Young Man Hand Video Watch: ఓ నగరంలోని రద్దీగా ఉండే ప్రదేశంలో ఎరుపు రంగుతో కూడిన మోటార్ సైకిల్‌తో ఓ యువకుడు వెళ్తున్నాడు. ఇదే సమయంలో అతని పక్క నుంచి అతని వెనకాల నుంచి పదుల సంఖ్యలో కార్లు ఇతర వాహనాలు కూడా వెళ్తున్నాయి. ఇదే సమయంలో ఆ రోడ్డుకు ఉండ చాలా మంది నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇదంతా జరుగుతున్నప్పటికీ కొంతమంది దృష్టి ఆ బైక్ పైన వెళ్తున్న యువకుడి పైనే ఉంది. ఎరుపు రంగుతో కూడిన మోటార్ సైకిల్ నడుపుకుంటూ వెళ్తున్న, ఆ యువకుడి ఒక చేయి బైక్ హ్యాండిల్ పై ఉంటే.. మరో చెయ్యికి అతి ప్రమాదకరమైన పాము చుట్టుకొని ఉంది. ఆ చేతిని అతడు ఒకపక్క వేలాడదీశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ యువకుడి చేతికి పాము చుట్టుకోవడానికి గల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..రద్దీగా ఉండే రోడ్డుపై అసలే మిట్ట మధ్యాహ్నం, రోడ్డు గుండా ఎన్నో వాహనాలు వెళుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఒక రెడ్ కలర్ బైక్ ఎంట్రీ ఇచ్చింది. ఈ బైక్‌ను యువకుడు సాధారణ స్పీడుతో నడుపుతున్నాడు. అలాగే ఆ యువకుడి ఒక చేతు హ్యాండిల్‌పై ఉంటే మరొక చేతి సాధారణంగా వేలాడి ఉంది. ఈ వేలాడి ఉన్న చేతికి పాము చుట్టుకొని ఉంది. దీన్ని గమనించిన కొంతమంది వాహనాదారులు వారు నడుపుతున్న బైక్ స్పీడును తగ్గించి మరి అతడి చేతి వైపు చూస్తున్నారు. 

సాధారణంగా కొన్ని పాములు దాడి చేసిన తర్వాత జంతువులు లేదా మనుషుల చుట్టూ చుట్టుకుంటూ ఉంటాయి. ప్రాణం తీసే అంతవరకు ఆ పాములు  చుట్టుకొని మాత్రమే ఉంటాయి. మరికొన్ని పాములయితే వాటికందరాలను బిగుతుగా చేసి ఇలా చుట్టుకుని ఊపిరాడకుండా చేస్తాయి. అయితే ఈ పాము కూడా ఆ యువకుడిని దాడి చేసినట్లు ఉంది. దాడి చేసి అలాగే చేతుకు చుట్టుకొని ఉండిపోయినట్లు తెలుస్తోంది. దీంతో యువకుడు ఆ పాము నుంచి రక్షణ పొందేందుకు పాముతో పాటు అలాగే హాస్పిటల్ కి వెళ్తున్నట్లు అనిపిస్తోంది. 

సాధారణంగా ఇలాంటి పాములకు సంబంధించిన వీడియోలు చాలా ఆరుదుగా మాత్రమే వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఆ యువకుడి చేతుకు చుట్టుకొని పాము ఉండడంతో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. మరి ముఖ్యంగా కొంతమంది వాహనదారులైతే బైకులను ఆపి మరీ స్మార్ట్ ఫోన్లలో చిత్రీకరిస్తున్నారు. ఈ వైరల్ అవుతున్న వీడియోను  'M.S Gaming' అనే యూట్యూబ్ ఖాతా నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేల మందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వీడియోని చూసి షాక్ అయినవారు కామెంట్లు కూడా చేస్తున్నారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News