Snake Viral Video: సాధారణంగా పాములకు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇన్‌స్టా, ఫెస్‌బుక్ ఇలా అన్ని పోషల్ మీడియాల్లో జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలను నెటిజన్స్ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల వైరల్ అయిన అనే కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియోలు లక్షల్లో వ్యూస్ పొందాయి. దీంతో చాలా మంది పాములకు సంబంధించిన వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది స్నేక్ క్యాచర్స్ పాములు పట్టుకునే క్రమంలో కూడా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే తాజా ఇలాంటి ఓ వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తాజాగా వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి అనుకోకుండా పామును పట్టుకునేందుకు వెళ్తాడు. అయితే ఆ అనకొండ పాము చాలా పెద్దదని గ్రహించి.. ఆ యువకు పారిపోయే ప్రయత్నం చేస్తాడు. ఇంతలోనే పాముకు అతడిపై దాడి చేసేందుకు చూస్తుంది. అయితే అతడు ముందుగానే దీనిని గ్రహించి.. గొడను పట్టుకుని ఉంటాడు. ఇంతలోనే ఆ పాము అతడిని మరో సారి కూడా దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇలా చాలా సార్లు జరిగిన తర్వాత అతడు ఆ పాము నుంచి తప్పింకుంటారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ వీడియోలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఈ వీడియోను @VikasThakurYoutuber అనే యూట్యుబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియోను స్నేక్ బైట్ మాన్ అని క్యాప్షన్ పెట్టి సోషల్ వీడియోలో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 45K పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే ఈ వీడియో చూస్తున్నవారు " ఆయన ఆపదలో ఉన్నప్పుడు ఈ వీడియో తీస్తున్న కెమెరా మ్యాన్ ఏం చేస్తున్నారని" ప్రశ్నిస్తున్నారు. అలాగే కొంతమంది "స్పైడర్ మ్యాన్" అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా పాములు పట్టుకునే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









