Rare Snake Full Viral Video Watch: పాములు ఎంత భయకరమైనవో అందరికీ తెలిసిందే.. అవి ఒక్కసారి దాడి చేస్తే చంపకుండా వదలవు.. కొన్ని పాములైతే, దాడి చేసిన క్షణాల్లో మరణించే అవకాశాలు ఉన్నాయి. అందుకే పాముల దగ్గరికీ వెళ్లేందుకు ఎవ్వరూ ఇష్టపడరు. ఇదిలా ఉంటే ప్రపంచంలో ఎన్నో రకాల పాములున్నాయి. ఇందులో చాలా వరకు ప్రమాదరకరమైన పాములే ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మనుషులు, జంతువులకు హాని కలిగించని పాములు కూడా ఉంటాయి. ఇవి కేవలం ఆకలి తీర్చుకునేందుకే క్రిమి, కీటకాలను తింటూ ఉంటాయి. మరికొన్ని పాములు చెట్లు, పూలు, పండ్లు తిని కూడా బ్రతుకుతాయి. ఇటీవలే ఇలాంటి పాముకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం యూట్యుబ్‌లో వైరల్ అవుతున్న ఈ షార్ట్ వీడియోలో ఒక చిన్న పాము పుట్ట చూడొచ్చు. అలాగే ఈ పుట్టుకు ఉన్న రంధ్రం దగ్గర మనిషి వేళ్లను కూడా గమనించవచ్చు. అయితే అందులో ఉన్న పామును పట్టుకునేందుకు ఆ వ్యక్తి తన రెండు వేళ్లను పుట్టు దగ్గర ఉంచారు. అలాగే ఇంతలోనే పుట్టలో నుంచి పాముకు రావడం మీరు చూడొచ్చు.
అయితే పాము అతను పెట్టిన వేళ్లను గమనించలేకపోతుంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఆ యువకుడు పాము తలను పట్టుకుంటాడు. ఆ యువకుడు పాము తలను పట్టుకుని.. పామును పుట్టలోపలి నుంచి లాగడం మీరు చూడొచ్చు. అతను పామును పూర్తిగా పుట్టలో నుంచి బయటికి లాగుతాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఈ పాము విషపూరీతమైనది కాకపోవడంతో దీనిని అతను పట్టుకున్నారని క్యాప్షన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం చాలా మంది పాములు పట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియో షార్ట్‌ను @Creativesnaketrap50 అనే యూట్యుబుట్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ వైరల్ అవుతున్న వీడియోను కొన్ని లక్షల మంది వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 48 వేల మంది లైక్ చేశారు. అలాగే కొంతమంది ఈ వీడియోకు కామెంట్స్ కూడా చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









