)
Snake Attack Porcupine: అడవిలో పందికొక్కు కామెడీగా కనిపించినా.. అది చాలా ప్రమాదకరమైన జంతువు. చిరుత పులి, సింహం లాంటి జంతువులు కూడా వాటిని చూసి భయపడతాయి. ఎందుకంటే పందికొక్కు శరీరంపై ఉన్న ముళ్లు కారణంగా దానికి ఏ జంతువైనా భయపడుతుంది. ఆ ముళ్లు గుచ్చుకుంటే నరకం కనిపిస్తుంది. దీంతో దాని జోలికి ఏ జంతువు వెళ్లేందుకు ప్రయత్నించదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. పందికొక్కును మింగేందుకు ఓ పాము ప్రయత్నించింది. అయితే ఆ పాము ముళ్లు నుంచి ఎలా తప్పించుకుంది. పందికొక్కును పాము మింగేసిందా? ఏం జరిగిందో ఇప్పుడీ వీడియో చూసి తెలుసుకోండి.
అడవిలో నల్లత్రాచు పాముని చూస్తే ఏ జంతువైనా భయపడుతుంది. ఆ పాము కాటేస్తే మనిషే కాదు ఏ జంతువైనా నిమిషాల్లో ప్రాణం పోవాల్సిందే. అలాంటి భయంకరమైన పామును ఓ పందికొక్కు ముప్పు తిప్పలు పెట్టింది. పాము ఎప్పటిలాగే తన వేటాడే స్వభావంతో అడవిలో తిరుగుతుంది. ఎంతో ఆకలిగా దానికి దొరికిన ఆహారాన్ని తినేందుకు ఎదురుచూస్తుంది. అయితే ఈ క్రమంలో ఓ పందికొక్కు దాని కంట పడింది. కానీ, ఆ పందికొక్కు ఆ నల్లత్రాచు పామును చూసి ఏమాత్రం భయపడలేదు.
ఎందుకంటే దాని పదునైన ముళ్లు కారణంగా అది ఏమాత్రం భయం లేకుండా పందికొక్కు చూస్తుంది. అయితే ఆకలి మీద ఉన్న పాము మాత్రం దాన్ని అమాంతం మింగేసేందుకు నోరు తెరిచింది. పాము అమాంతం నోరు తెరిచి పందికొక్కుపై దాడి చేసింది. అయితే కట్ చేస్తే ఆ పాము పందికొక్కుని మింగేసిందా లేదా అనేది తెలియలేదు. కానీ, పందికొక్కు ముళ్లు మొత్తం పాముకు అంటుకున్నాయి. ఆ ముళ్లు గుచ్చుకుంటే వచ్చే నొప్పి అంతా ఇంతా కాదు. ప్రాణం పోయేంత నొప్పి వస్తుంది ఆ ముళ్లు గుచ్చుకుంటే. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.
ఈ జాతి పాములు సాధారణంగా ఎలుకలు, గబ్బిలాలు, బాతులు, కోళ్లు వంటి ఇతర చిన్న జంతువులను వేటాడతాయి. వాటి ఆహారం జీర్ణం కావడానికి కొన్ని రోజులు పడుతుంది. కానీ ఈసారి దురదృష్టవశాత్తు ఈ పాము తన విందు కోసం తప్పు ఎరను ఎంచుకుంది.
ఈ పాము ఒక ముళ్ల పందిని మింగేసింది. కానీ అది జీర్ణించుకోలేక భరించలేని నరకాన్ని అనుభవించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో వీక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook