cobra snake watching mobile phone video viral: పాముల వీడియోలు నెట్టింట తరచుగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా ఫన్నీగా ఉండే పాముల వీడియోలు ఇటీవల ఎక్కువగా నెట్టింట ట్రెండింగ్ గా మారుతున్నాయి. నెటిజన్ లు సైతం పాముల వీడియోలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల పాములు టెక్నాలజీనీ అడాప్ట్ చేసుకుంటున్నట్లు కన్పిస్తున్నాయి.
ముఖ్యంగా పాములు.. బూరలకు కాకుండా.. ఫోన్ లో నాగిని పాటకు డ్యాన్స్ చేసిన వీడియోలు ఇటీవల వైరల్ అయ్యాయి. అంతే కాకుండా.. రోడ్డు మీద పాములు రొమాన్స్ చేసుకున్న వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే.. తాజాగా మాత్రం.. ఒక పాము ఏకంగా ఫోన్ చూస్తు మైమర్చిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఈ వీడియోలో.. ఒక పాము ఇంట్లోకి ప్రవేశించింది. మరీ అక్కడున్న కొంత మంది ఫోన్ లలో ఏదో పాటలు పెట్టి వెళ్లిపోయారు. అక్కడకు వచ్చిన పాము.. తన పని మర్చిపోయి.. ఈ మొబైల్ లో వస్తున్న రీల్స్ ను వింతగా చూస్తుంది. అది కదలకుండా.. అదేంటో విచిత్రంగా పాము చాలా సేపు ఫోన్ చూస్తు అక్కడే ఉండిపోయింది. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ నేపథ్యంలో దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఇప్పటి వరకు ఫోన్ లలో చిన్న, పెద్దా అని తేడాలేకుండా ప్రజలంతా విలవిల్లాడిపోతున్నారు. ఈ కెటగిరిలో ఇక పాములు కూడా వచ్చి చేరాయా..?. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఈ మనుషులున్నారే.. పాముల్ని కూడా చెడగొట్టారంటూ సెటైరిక్ ఫన్నీ కామెంట్లు వేస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.