Snakes Romance In Bedroom Viral Video Watch: ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాని ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు. దీంతో ప్రపంచంలో ఏ మూలన ఎలాంటి సంఘటన జరిగిన ఎంతో సులభంగా తెలుసుకోగలుగుతున్నారు. అలాగే సమాచారం క్షణాల వ్యవధిలోనే కండాంతరాలు దాటి పోతోంది. దీంతో కొంతమంది రెచ్చిపోయి ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే షేర్ చేసిన క్షణాల వ్యవధిలోనే ట్రెండ్ అవుతున్నాయి. వాటిల్లో ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలే ఉంటున్నాయి. పాములకు సంబంధించిన కొన్ని భయంకరమైన వీడియోలను కూడా సోషల్ మీడియా వినియోగదారులు ఎంతో ఆసక్తిగా చూసేందుకు ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా ఈ వీడియో లు కూడా వారిని ఎంతగానో ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. అయితే ఇటీవల రెండు పాములకు సంబంధించిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది.
So one of our beat staff got SOS call in middle of night yesterday from a village. Imagine these highly venomous ‘Walls Krait’ doing duel in somebody bedroom. They were rescued & released safely later. pic.twitter.com/nnzOHjATte
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) October 22, 2024
సాధారణంగా పాములు ఎక్కువగా అడవుల్లో ఇతర ప్రదేశాల్లో జీవిస్తూ ఉంటాయి.. అడవుల్లో ఎలాంటి ఆహారాలు లేకపోతే జనజీవనంలోకి సంచారం చేస్తాయి. ముఖ్యంగా ఎలుకలు ఎక్కువగా ఉండే ఇళ్లలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాగే బొద్దింకల అధికంగా ఉండే ప్రదేశాల్లో కూడా పాములు సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా సంచారం చేస్తున్న సమయంలో కొంతమంది స్నేక్ క్యాచర్స్ వాటిని పట్టుకొని సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు. తాజాగా ఓ పాము జంటకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. రెండు పాములు బెడ్ రూమ్‌లోకి ప్రవేశించి ఒకదానికొకటి దాడి చేసుకోవడం వేరు ఈ వీడియోలో గమనించవచ్చు. అయితే కొంతమంది నెటిజన్స్ ఇవి దాడి చేసుకోవడం లేదని.. బెడ్ రూమ్‌లో రొమాన్స్ చేసుకుంటున్నాయని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. గతంలో ఇలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్లో తెగ సంచలనం సృష్టించింది.
ఈ పాములు సరిగా బెడ్ రూమ్ బెడ్ కిందే ఇలా ఒకదానికొకటి దాడి చేసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఈ సన్నివేశాలను చూసి ఎందుకు ఆ ఇంటి చుట్టుపక్కల ఉండే పరిసర ప్రాంతాల ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. అయితే ఆ ఇంట్లో నివసించే వారు ఏదో చప్పుడు అవుతుందని ముందుగా గది మొత్తం వెతికారట. ఇలా ఎక్కడ కనిపించకపోవడంతో చివరగా బెడ్ కింద వెతికితే ఈ పాముల జంట ఒకదానికొకటి దాడి చేసుకోవడం కనిపించాయట. ఆ ఇంటి యజమాని వెంటనే స్నేక్ క్యాచర్స్‌కి సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకొని ఆ పాములను సురక్షితమైన ప్రదేశాలకు తరలించారు. నిజానికి ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో రోజు వేలకొద్దీ వైరల్ అవుతూ వస్తున్నాయి. నెటిజన్స్ వీటినే ఎక్కువగా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









