
Snakes Romance Latest Video Watch: రెండు నాగు పాములు చెట్టుకొమ్మపై కూర్చుని ఒకదానితో మరొకటి రొమాన్స్ చేసుకుంటున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రెండు నాగుపాములు పెనవేసుకొని ఎనలేని శృంగారాన్ని అనుభవిస్తున్నాయి. ఆ రెండు పాములు పోట్లాడుకోవడం లేదు.. జాగ్రత్తగా గమనిస్తే.. ఈ రెండు ఎంతో ప్రేమగా అన్యోన్యంగా ఉన్నాయి. సాధారణంగా వర్షా కాలంలో మనకు పాముల బెడద ఎక్కువగా ఉంటాయి. చెట్లు, పొదలు ఎక్కువగా ఉన్న చోట అవి బొరియల్లో నివాసం ఏర్పరుచుకుంటాయి. అక్కడే నివాసం ఉంటాయి. ముఖ్యంగా కొండ నివాస ప్రాంతాల్లోనే ఈ పాముల బెడద ఎక్కువగా ఉంటుంది.
కొండ చరియల్లో బొరియల్లో ఉన్న పాములు ఈ వానలకు కిందకు కొట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక నెటిజన్లు కూడా నెట్టింట్లో పాములకు సంబంధించిన వీడియోలను ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతున్నారు. కొండ ప్రాంతాల్లోనే కాదు.. మైదాన ప్రాంతాల్లో చెరువులు, అడవులు లాంటి ప్రదేశాలు ఎక్కువగా ప్రదేశాల్లో ఈ పాములు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఇంట్లోకి ప్రవేశిస్తాయి. మనం ఏదైనా చేయబోతే అవి ప్రాణ భయానికి మనల్ని కాటువేయడానికి వెనకాడవు. మనలో చాలా మంది పాము కాటు కంటే పాము కాటేసిందన్న భయంతోనే మృతి చెందుతూ ఉంటారు.
ముఖ్యంగా పాము కాటు వేస్తే.. ఆ ప్రదేశంలో గట్టిగా కట్టుకట్టి సరైన సమయంలో చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడతారు. ముఖ్యంగా వర్షాకాలంలోనే పాములు ఎక్కువగా సంగమిస్తూ ఉంటాయి. సమయంలో ఆడ పాములతో పాటు మగ పాములు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయట. ఇప్పుడు ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఓ పాము మరొక పామును అట్రాక్షన్ లో పడేసిందుకు ఏకంగా చెట్టును ఎక్కేసింది. ఈ వీడియోనే నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
వీడియో వెరాల్లోకి వెళితే.. ఓ చోట చెట్టుపై రెండు పాములు పడగవిప్పి కూర్చొన్నట్టు కనిపిస్తాయి. ఇందులో మగపామును ఆడపాము ఆకర్షిస్తోంది. తన కనుసైగలతో రొమాన్స్ కు రమ్మంటూ సైగ చేస్తున్నట్టు ఉంది. నిజంగానే రగులుతున్న మొగలిపొద ఈ పాముల్లో మొదలైంది. ఈ పాములు వర్షాకాలం కావడంతో జత కట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయని కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ఈ వీడియోను షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను వేల మందిపైగా చూసినట్టు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.