Snakes Vs Mongooses Video: పాములు, ముంగిసల మధ్య సహజ శత్రువులుగా భావిస్తారు. ఆహారం కోసం పోటీపడుతూ ఈ రెండు దాడి చేసుకుంటాయి. వాటి మధ్య వైరం వాటి జీవన పోరాటంలో భాగమే.. పాముల కంటే ముంగిసలు చురుకైనవిగా భావిస్తారు. ఇవి పాములు దాడి చేసిన వాటి విషానికి తట్టుకోగలుగుతాయి. అలాగే పాముల శరీరంతో పోలిస్తే, ముంగిసల బాడీ చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి దానిపై దాడి చేసిన అస్సలు గాయాలు కాకుండా ఉంటాయి. తాజా ఈ రెండికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సాధారణంగా పాములు, ముంగిసలు అజాత శత్రువులగా చెప్పుకుంటారు. ఇవి రెండు ఎదురుపడినప్పుడు తప్పకుండా దాడి చేసుకుంటాయి. పాములతో పోలిస్తే ముంగిసలు ఎంతో స్ట్రాంగ్‌గా ఉంటాయి. కాబట్టి ఇవి దాడి చేసిన సులభంగా తట్టుకోగలుగుతాయి. తాజా పాములు, ముంగిసలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పాముతో పాటు ముంగిస తీవ్రంగా పోటీ పడుతూ దాడి చేసుకోవడానికి సంబంధించిన సన్నివేశాలను మీరు చూడవచ్చు.
వైరల్ అవుతున్న పాములు, ముంగిసకు సంబంధించిన వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ రోడ్డుపైన పాము, ముంగిస ఎదురు ఎదురు రావడం మీరు చూడవచ్చు. ఇందులో పాము తన దారిలో తాను వెళ్తుండగా.. అయితే ముంగిస మాత్రం ఆ పాముపై దాడి చేస్తుంది. రెండు ఒకదాని కంటే ఒకటి ఎక్కువగా దాడి చేసుకుంటూ ఉంటాయి. ముంగిసనైతే.. పాముపై చాలా సార్లు దాడి చేయడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. పాము కూడా ముంగిసపై దాడి చేస్తుంది. ఇలా రెండు ఒకదానికి ఒకటి దాడి చేసుకుంటూ ఉంటాయి. దీనికి సంబంధించిన దృష్యలు సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియోను యూట్యుబ్‌లో king cobra ట్యాగ్‌తో @DogForceCat అనే యూట్యుబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు. 30 సెకండ్ల గల వీడియో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తోంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు ఒకటిన్నర లక్షల వరకు సోషల్ మీడియా వినియోగదారులు లైక్ చేశారు. అలాగే 3,680 మంది నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను కొన్ని లక్షల మందికి పైగా వీక్షించినట్లు సమాచారం.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









