)
Sri Lankan man molested new Zealand solo traveller video: ప్రపంచ వ్యాప్తంగా కామంధులు మహిళలు, అమ్మాయిలు కన్పిస్తే చాలు పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. పసిపాప నుంచి పండు ముసలి వరకు ఏ ఒక్కర్ని కూడా వదలడంలేదు. మొత్తంగా కామాంధులు ఎక్కడ ఆడది కన్పిస్తుందా.. ఎక్కడ తమ కామాన్ని తీర్చుకుందామా..? అంటూ నక్కలాగా కాచుకుని ఉంటున్నారు. మహిళల భద్రత మాత్రం ప్రస్తుతం గాల్లో దీపంలా మారిందని చెప్పుకొవచ్చు.
మనదేశంలో వారినే కాదు.. విదేశాల నుంచి వచ్చిన టూరిస్టులను కూడా కొంత మంది కేటుగాళ్లు వదలడం లేదు . ఇటీవల శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఒక విదేశీ యువతికి ఘోరమైన ఘటన ఎదురైంది. దీన్ని ఆమె వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతొ అది కాస్త వైరల్‌గా మారింది.
Breaking:
Sri Lanka arrests 23-year-old man after a foreign woman posted a video exposing his indecent behaviour.Safety is not a privilege. It’s a right. pic.twitter.com/Bb3rC2lJxR
— ANNI (@chulbuli_Anni) November 16, 2025
న్యూజిలాండ్ కు చెందిన ఒక టూరిస్టు శ్రీలంకకు పర్యటనకు వచ్చింది. ఆమె ఒంటరిగా తన టుక్ టుక్ అనే ప్రత్యేక వాహనంలో వెళ్తుంది. ఇంతలో అక్కడి ఒక వ్యక్తి ఆమెను చూశాడు. వెంటనే ఆమెను ఫాలో అయ్యాడు. ఆమె స్పీడ్ గా వెళ్తున్న ఏదో మాట్లాడుతున్నట్లు ఆమెకు చెప్పాడు. దీంతో ఆమె ఏదో విషయంఅని ఆగింది. దీంతో అతను తన పైత్యం చూపించాడు.
తనతో సెక్స్ చేయాలని వచ్చిరానీ భాషలో చెప్పాడు. అంతటితో ఆగకుండా ఆమె ముందు ఏకంగా ప్రైవేటు పార్ట్ ను బైటకు తీసి హస్త ప్రయోగం కూడా చేశాడు. దీంతో ఆమె షాక్ కు గురైంది. కొంత సేపు ఆమె నోట మాటరాలేదు. అసలు ఏంజరుగుతుందో అని షాక్ లో ఉండిపోయింది. ఆ తర్వాత తెరుకుని తన వాహనంతో ముందుకు వెళ్లిపోయింది. అయితే.. ఆమె ఈ ఘటనను సీక్రెట్ గా తన ఫోన్ లో రికార్డు చేసింది.
బాధితురాలు ఈ దారుణ ఘటనకు చెందిన ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ‘ఈ సంఘటన వల్ల నేను నా ట్రిప్‌ను క్యాన్సిల్ చేసుకోనని చెప్పింది. నా కాన్ఫిడెన్స్ కొంత దెబ్బ తిన్న మాట వాస్తవమే కానీ.. నాకు అతడిపై చాలా కోపంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక, ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో స్థానిక పోలీసులు రంగంలోకి దిగి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి