)
Stray dog attacks on 6 years old boy in Kannur Kerala video: ఇటీవల కాలంలో వీధికుక్కల దాడుల ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ముఖ్యంగా వీధి కుక్కలు కన్పించిన వారి పిక్కలు పీకేస్తున్నాయి. వాటికి తిండిపెట్టిన, ఏమన్నా అన్న, అనకపోయిన కూడా అవి దాడులకు దిగుతున్నాయి.
మొత్తంగా వీధికుక్కల దాడి ఘటనలు ఇటీవల తీవ్ర భయాందోళనలు కల్గిస్తున్నాయి.ఈ క్రమంలో దీనిపై ఏకంగా సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్దరచ్చ ఏర్పడింది. ఈ క్రమంలో వీధి కుక్కల దాడుల ఘటనలు ఇటీవల మరీ ఎక్కువగా మారాయి. తాజాగా.. ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కలు విరుచుకుపడ్డాయి.ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
സൈക്കിളും കൊണ്ട് ഓടി 6 വയസുകാരൻ ; തെരുവ് നായയുടെ കടിയേൽക്കാതെ രക്ഷപ്പെട്ടത് തലനാരിഴയ്ക്ക്#kannur #straydogs #ZeeMalayalamNews pic.twitter.com/o0m7EZ58gW
— Zee Malayalam News (@ZeeMalayalam) October 4, 2025
కేరళలోని కన్నూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలుడు తన ఇంటి నుంచి సైకిల్ మీద బైటకు వెళ్తున్నాడు. ఇంతలో వీధికుక్కలు అతనిపై దాడులకు దిగాయి. వెంటనే అతను పరిగెత్తుకుంటూ తన ఇంటికి వచ్చేశాడు.
కానీ అప్పటికే అతడిపై వీధికుక్కలు దాడులు చేశాయి. కానీ అతను వెంటనే రియాక్ట్ కావడంతో వల్ల ఎక్కువగా కుక్కకాట్లకు గురికాకుండా బైటపడ్డాడు. వెంటనే ఇంట్లో వాళ్లు అలర్ట్ అయి,ఆ వీధికుక్కల్ని అక్కడి నుంచి తరిమి వేశారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. పాపం.. ఆ పిల్లాడు కింద పడి ఉంటే.. అతనిపై కుక్కలు ఎంత ఘోరంగా దాడిచేసేవో అంటూ నెటిజన్లు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook