
Cobra snake video: కొన్నిరోజులుగా భానుడు ఎండలతో చుక్కలు చూపిస్తున్నారు. ఎండ వేడికి తాళలేక మనుషులే కాదు.. నోరులేని జీవాలు సైతం విలవిల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా ఉదయం నుంచి భానుడు తన ప్రతాపం చూపిస్తున్నారు. ఎండల భయానికి జనాలు అత్యవసరమైతే తప్ప బైటకు అస్సలు వెళ్లడంలేదు. అంతేకాకుండా.. భానుడి ప్రభావంతో చాలా మంది ఇప్పటికే డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుతం ఎండల ప్రభావానికి గురికాకుండదంటే.. ప్రతి గంటకు చల్లని నీళ్లు, జ్యూస్ లు, కొబ్బరి బొండాలు తాగుతుండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో మనుషులే కాదు.. ఎండల ప్రభావానికి నోరులేని జీవాలు సైతం విలవిల్లాడిపోతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఒక పాములు ఎండల నుంచి తప్పించుకునేందుకు ఒక హ్యండ్ బోర్ వద్దకు చేరుకుంది. అక్కడ బోర్ కింద పాము కూర్చుని తన పడగ మీద మంచి నీళ్లను పడేలా చూసి మరీ అక్కడే కాసేపు ఉండిపోయింది. పాము అక్కడి నుంచి అస్సలు కదలడంలేదు.
పాము ఎండకు ఎంత విలవిల్లాడిపోయిందే.. ఎండకు అలానే కదలకుండా ఉండిపోయింది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. చాలా మంది పాము ఎండ వేడికి సేదతీరుతున్న వీడియో చూసి షాక్ అవుతున్నారు. పాపం.. అది కూడా ఒక ప్రాణి కదా.. దాని ప్రయత్నం అది చేస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ సమ్మర్ లో చాలా మంది జంతు ప్రేమికులు.. తమ బాల్కనీలు, గార్డెన్ లు వంటి అనేక ప్రదేశాల్లో నీటి తొట్టెలను ఏర్పాటు చేసి మరీ ఉంచుతారు.ఈ నీళ్లను మూగ జీవాలు వచ్చితాగేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe