Cobra Snake drinks Water from Glass Video: భానుడు తన ప్రతాపం చూపిస్తున్నారు. ఇంటి నుంచి బైటకు వెళ్లాలంటేనే జనాలు జంకుతున్నారు. అసలు.. ఎమర్జెన్సీ అయితే తప్ప జనాలు అస్సలు బైటకు వెళ్లడంలేదు. మొత్తంగా ఎండలు మాత్రం జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు నిపుణులు సైతం.. ఉదయం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బైటకు వెళ్లకూడదని చెప్తున్నారు. ఎండల నుంచి కాపాడుకొవడం కోసం పండ్ల రసాలు, నీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణాలు, కొబ్బరి బొండాలు వంటివి తీసుకుంటూ ఉండాలని చెబుతున్నారు. అయితే.. ఎండల వేడికి ప్రజలు పిట్టల్లా కూడా రాలిపోతున్నారు. మనుషులే కాదు.. నోరులేని జీవాలు సైతం.. ఎండకు తాళలేకపోతున్నారు.
తాజాగా.. ఒక భారీ సర్పం ఎండకు తాళలేక నీళ్లకోసం అది చేసిన పోరాటం ప్రస్తుతంనెట్టింట వైరల్ గా మారింది. పాముల వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు సైతం కోబ్రాలు, కొండ చిలువల వీడియోలు చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అంతే కాకుండా.. పాములకు చెందిన విభిన్న రకాలైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడైతే ఒక పాము నీళ్ల కోసం తెగ వెతికింది.
ఇంతలో దానికి ఒక గ్లాసులో నీళ్లు కన్పించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. నీళ్లలో దాని మూతి పెట్టి మరీ గట గటా అంటూ నీళ్లను చుక్క కూడా మిగల్చకుండా తాగేసింది. కనీసం నీళ్లు తాగిన తర్వాత ఆ సర్పం.. తన నోటిని సైతం బైటకు తీయడం లేదు.
Read more: Viral Video: ఎండలు బాబోయ్.. ఎండలు.. హ్యాండ్ బోర్ కింద సేదతీరుతున్న కోబ్రా స్నేక్.. వీడియో వైరల్..
మరీ గ్లాసులో చల్లగా ఉంది అనుకుందో మరేంటో కానీ.. ఆ సర్పం మాత్రం తన మూతిని కాసేపు గ్లాసులోనే ఉంచింది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు పాపం.. ఎంత దాహం వేసిందో.. నీళ్లను గట గటా తాగేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఎండ కాలంలో నోరులేని జీవాల కోసం బాల్కనీలు, పెరట్లో, ఇంటి ఆవరణలో నీటితొట్టెలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.









