)
Swetha Naagu Snake Real Video: సోషల్ మీడియాలో రోజురోజు విభిన్న రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని వీడియోలు అందరికీ ఆనందాన్ని అందిస్తే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వీటికి సంబంధించిన వీడియోలే ఎప్పుడు వైరల్ అవ్వడం విశేషం. అప్పుడప్పుడు అత్యంత ప్రమాదకరమైన పాములకు సంబంధించిన వీడియోలు కూడా ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా శ్వేత నాగు పాము కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
సోషల్ మీడియాలో అత్యంత ప్రమాదకరమైన తెలుపు రంగులో కనిపించే పాము కు సంబంధించిన వీడియో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు చిన్న శ్వేతనాగు పాముతో ఆడుకోవడం మీరు గమనించవచ్చు. పాపం వారిని చూసి దాడి చేసే ప్రయత్నం కూడా చేస్తోంది. దానిని ఏమాత్రం గమనించకుండా.. ఆ పాముతో ఆడుకున్నారు. ఇప్పుడు ఈ వీడియోని వైరల్ గా మారింది. సాధారణంగా శ్వేత నాగులు అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇలా ఆ యువకులు ప్రమాదకరమైన నాగుపాముతో ఆడుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అలాగే వీడియోలో శ్వేత నాగు పడగ విప్పి ఉండడం మీరు గమనించవచ్చు. ఈ పాము అత్యంత ప్రమాదకరమైన విషాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా వేగంగా కూడా కదులుతూ ఉంటాయి. అలాగే ఈ పాములు మనుషులను కూడా పగపడతాయని పూర్వీకులు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ పాములు చూడడానికి తెలుపు రంగులో ఉండి ప్రత్యేకమైన మచ్చలను కలిగి ఉంటాయి. ఇలాంటి శ్వేత నాగులను పట్టుకోవడానికి ప్రత్యేకమైన నైపుణ్యం అవసరం ఉంటుంది. లేదంటే అవి దాడి చేసి ప్రాణాలు తీసే అవకాశాలు కూడా ఉన్నాయి.
సాధారణంగా చిన్న శ్వేత నాగు పాములు చాలా చురుకుగా ఉంటాయి. ఇవి ఒకచోట నుంచి మరొక చోటికి ఎంతో వేగంగా వెళ్తూ ఉంటాయి. కాబట్టి చాలామంది వీటిని చూడగానే భయపడిపోతూ ఉంటారు. అంతేకాకుండా పాములు తెల్లగా కనిపించడంతో ఆశ్చర్యానికి గురవుతూ ఉంటారు. అయితే, ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో కూడా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook