Takshak Nag Viral Video Watch: పురాణాల్లో తక్షక నాగు గురించి ఎంతో క్లుప్తంగా వివరించారు.. ముఖ్యంగా ఈ పాము గురించి మహాభారతంలో కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ తక్షక నాకు అనేది అత్యంత శక్తివంతమైందని, పాములకే రారాజు అని పురాణాల్లో పేర్కొన్నారు. నాగలోకంలో నివసించే అత్యంత శక్తివంతమైన పాముల్లో ఇది కూడా ఒకటట.. ఈ పాము ఎంతో కోపాన్ని కలిగి ఉండడమే కాకుండా మాయాశక్తులకు కూడా కలిగి ఉంటుంది. ఈ పామును నాగజాతికి రాజుగా కూడా చెప్పుకుంటారు. మహాభారతంలో కూడా తక్షక పాము కు సంబంధించిన పాత్ర కీలకమైంది.
మహాభారతంలో అనేకచోట్ల తక్షకుని గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా పరీక్షిత్తు మహారాజు కథలో తక్షకుడి పాత్ర ఎంతో కీలకమైంది గా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఒకసారి ఆ మహారాజు వేటాడడానికి అడవిలోకి వెళ్తాడు. అయితే ఇదే సమయంలో శమీక మహామునిని అవమానిస్తాడు.. అవమానానికి ప్రతీకగా ముని కుమారుడై పాపం పెడతాడు. ఈ ప్రభావంతో దక్షకుడు ఆ మహారాజును కాటు వేసి చంపేస్తాడు. ఇవే కాకుండా పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి.
సాధారణంగా తక్షకపామనేది కేవలం చెట్ల పైన మాత్రమే జీవిస్తుంది. ఇది ఏమాత్రం భూమిపై పాకదని కొంతమంది చెబుతూ ఉంటారు. నిజానికి చెట్లపై నుంచి దాదాపు ప్రతిరోజు గాల్లోనే వంద అడుగులకు పైగా ప్రయాణించగలుగుతుంది. అంతేకాకుండా చెట్లపై ఉండే ఆహారాలను మాత్రమే తింటుందని నిపుణులు తెలుపుతున్నారు. సాధారణంగా ఇలాంటి పాములు చాలా అరుదుగా ఉంటాయి. అలాగే కొన్ని ప్రదేశాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఈ పాము కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచి జిల్లాలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో తక్షక నాగు ప్రత్యక్షమైంది. అయితే ఈ పామును అందరు సాధారణంగా తిరిగే పాములే అనుకున్నారు. కానీ అక్కడి అటవీశాఖ అధికారులు గుర్తించి తక్షక నాగుపామని తెలిపారు. ఈ పామును అధికారులు బంధించి సురక్షితమైన ప్రదేశంలో వదిలిపెట్టారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఇంస్టాగ్రామ్ లో ఇప్పుడు విపరీతంగా వైరల్ గా మారింది. చూసిన వాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది అయితే ఇలాంటి పాములు చూడలేదని కామెంట్లు చేస్తున్నారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









