)
Teen girl drying her hairs with table video: సోషల్ మీడియాలో ప్రతిరోజు బోలేడు వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తుంటే ఆశ్చర్యంకు గురిచేస్తుంటాయి. మరికొన్ని వీడియోలు చూస్తుంటే షాకింగ్ కు గురిచేస్తుంటాయి. ఇటీవల కాలంలో కొంత మంది ఓవర్ నైట్ లో ఫెమస్ అయ్యేందుకు నానా పాట్లు పడుతున్నారు. అసలు వాళ్లు చేస్తున్నపనులను చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది.
when you don't have a hair dryer pic.twitter.com/W9SyS9X1xs
— Kang rekom (@kangrekom) October 3, 2025
కొంత మంది తమ ప్రాణాల్ని సైతం రిస్క్ లో పడేసుకుంటారు. వీరి వెర్రి చేష్టల్ని వీడియోలు తీసుకుని మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ పైత్యం చూపిస్తారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి తన వెంట్రుకల్ని డ్రై చేసుకునేందుకు ఏకంగా టేబుల్ ఫ్యాన్ ను పైకి ఎత్తి వెంట్రుకలకు పట్టుకుంది.
ఆమె తన వెంట్రుకల్ని మొత్తంగా తడారి పోయే విధంగా.. చాలా సేపు టేబుల్ ఫ్యాన్ ను పట్టుకుంది. అంతే కాకుండా తన పైత్యంను వీడియో కూడా తీసుకుంది. ఆమె అద్దం ముందు అటు ఇటు తిరుగుతూ తన వెంట్రుకల్ని డ్రై చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. పొరపాటున ఆ ఫ్యాన్ లో వెంట్రుకలు చిక్కుకుంటే సిట్యువేషన్ ఏంటని సీరియస్ అవుతున్నారు. ఆ ఫ్యాన్ కు కరెంట్ పాస్ అయితే లేదా పొరపాటున అది నీ తలమీద పడితే.. అప్పుడు ఎలా ఉంటది అని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook