Cobra Snake Video: ఏంటమ్మా అంత నచ్చిందా..?.. వైట్ కోబ్రాతో అందమైన అమ్మాయి క్యూట్ రీల్స్.. నెట్టింట సందడి చేస్తున్న వీడియో..

Girl playing with cobra snake: యువతి భారీ సర్పాన్ని తన మెడలో వేసుకుని మరీ రీల్స్ చేస్తుంది. ఈ వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు సెటైరిక్ గా కామెంట్లు చేస్తున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 14, 2025, 02:49 PM IST
  • వైట్ స్నేక్ తో యువతి రీల్స్..
  • వీడియో వైరల్..
Cobra Snake Video: ఏంటమ్మా అంత నచ్చిందా..?.. వైట్ కోబ్రాతో అందమైన అమ్మాయి క్యూట్  రీల్స్.. నెట్టింట సందడి చేస్తున్న వీడియో..

Teen girl playing with white colour cobra snake video: సాధారణంగా పామును చూసి ఎవరైన దూరంగా పారిపోతారు. ఎక్కడైన పాము కన్పిస్తే ఆ ప్రదేశంలోకి అస్సలు పోరు. చాలా మంది అసలు దారి పేరు ఎత్తడానికి సైతం ఇంట్రెస్ట్ చూపించరు . కానీ కొంత మంది మాత్రం దీనికి భిన్నంగా పాములు పట్టే హబీని పెట్టుకుంటారు. పాములు కన్పిస్తే తమకు చెప్పాలని ఫోన్ నంబర్ లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఎక్కడైన పాము వచ్చిందంటే చాలు జెట్ స్పీడ్ లో అక్కడకు వాలిపోతుంటారు.

Add Zee News as a Preferred Source

పాముల్ని చాకచక్యంగా పట్టుకుంటారు. దానితో ఫోటోలు, రీల్స్ చేస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో సైతం .. ఒక అందమైన యువతి... తెల్లని సర్పాన్ని తన మెడలో వేసుకుని రీల్స్ చేసింది. ఆ పాములు బుసలు కొడుతున్న ఏ మాత్రం కూడా భయపడకుండా.. ఆమె రచ్చ రచ్చ చేస్తుంది. పాము కళ్లలో చూస్తు.. దాన్ని మెడలో ఇష్టమున్నట్లు వేసుకుని రివర్స్ లో పాముకే టెన్షన్ పుట్టించేలా చేస్తుంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by reel vault (@reel_.vault)

అమ్మాయిని చూస్తుంటే.. చాలా క్యూట్ గా ఉంది. ఆ పాము ఏమో చాలా వైలెంట్ గా  ఉన్నట్లు ఉంది. మరీ ఆమెకు పాముల్ని పట్టడం చిన్నతనం నుంచి ఇష్టమో మరేంటో కానీ.. ఆమె ఎంతో చాకచక్యంగా ఆ పామును తన మెడలో వేసుకుని మరీ అక్కడి వాళ్లను షాక్ కు గురిచేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఆ పాము సైతం బుసలు కొడుతూ..మెల్లగా ఆమె మీదకు పడగ విప్పి ఆడుకుంటుంది.

Read more: Viral Video: అడవిలో పిక్నిక్ చేసుకుంటున్న ఫ్యామిలీ.. ఇంతలో ఏనుగు సడెన్ ఎంట్రీ.. ఆ తర్వాత..?.. షాకింగ్ వీడియో..

కానీ ఆమె మీదకు దాడి చేయడంలేదు. మరీ ఆ పామును తన చూపులతో వశీకరణం చేసుకుందో ఏంటో కానీ.. ఆమె చెప్పినట్లు ఆ పాము వింటుంది.  ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అందమైన అమ్మాయి ఏంటా పనులు అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అసలు ఆ పాము నిజమైనదేనా.. లేదా ఏఐ వీడియోనా అంటూ డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News