Telangana free bus effect women fight for seat video: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకంను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. దీనిలో భాగంగా మహిళలకు తెలంగాణ వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించారు. అయితే.. ఉచిత బస్సు ప్రయాణం లేనప్పుడు బస్సులో చిల్లర విషయంలో, బస్సులు స్టాప్ లు ఆపడం విషయంలో అప్పుడప్పుడు గొడవలు జరిగేవి.
కానీ ఏమూహుర్తాన సీఎం రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సు పథకం స్టార్ట్ చేశాడో కానీ.. తరచుగా మహిళల సిగపట్లకు చెందిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో సీటు కోసం ముఖ్యంగా మహిళలు జుట్లుపట్టుకుని మరీ కుస్తీలకు దిగుతున్నారు. మగాళ్ల కంటే పచ్చిగా బూతులు తిట్టుకుంటూ మరీ రెచ్చిపోతున్నారు. మొత్తంగా ప్రస్తుతం ఇద్దరు మహిళలు రన్నింగ్ బస్సులో నువ్వెంత అంటే నువ్వెంత అన్న విధంగా ఫైటింగ్ కు దిగారు.
రన్నింగ్ బస్సులో.. బూతులు తిట్టుకుంటూ.. నెట్టుకుంటూ గొడవకు దిగారు. మరీ చుట్టుపక్కల వారు ఆపిన కూడా ఇద్దరు ఏ మాత్రం తగ్గడం లేదు. ఒకరిపై మరోకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ... పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది.
ఈ క్రమంలో నెటిజన్ లు దీనిపై తమదైన స్టైల్ లో స్పందిస్తున్నారు. సీఎం రేవంత్ తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం ఇలా ఉందని కౌంటర్ లు వేస్తున్నారు. మరికొందరు మాత్రం.. వెంటనే ఉచిత బస్ సదుపాయం తీసేయాలని.. కూడా కామెంట్లు చేస్తున్నారు.









