Wives For Rent: ఇచ్చట అద్దెకు భార్యలు లభించును.. అవును ఇది నిజం.. ఎక్కడో మీకు తెలుసా?

Wives Are Available For Rent: థాయిలాండ్‌లోని పట్టాయాలో జరుగుతున్న అద్దె భార్యల వ్యాపారానికి చాలా డిమాండ్ ఉంది. పల్లె ప్రాంతాల్లో నుంచి వచ్చిన కొంతమంది అమ్మాయిలు విదేశీయులకు భార్యలుగా మారుతున్నారు. ముఖ్యంగా ఈ వ్యాపారాల్లో భార్యలుగా పేద మహిళలే ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 6, 2025, 06:05 PM IST
 Wives For Rent: ఇచ్చట అద్దెకు భార్యలు లభించును.. అవును ఇది నిజం.. ఎక్కడో మీకు తెలుసా?

Wives Are Available For Rent: ఆగ్నేయాసియాలోని అత్యంత అందమైన పర్యాటక ప్రదేశంగా కొనసాగుతున్న థాయిలాండ్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడికి ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు భారీ ఎత్తున తరలివస్తూ ఉంటారు. అందమైన బీచ్ లతోపాటు వివిధ ప్రదేశాలను సందర్శించేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. ఈ ద్వీపదేశం చుట్టూ అందమైన సముద్రాలు ఉండడం వల్ల పర్యాటకులు ఏడాది పొడవునా క్యూ కడుతూ ఉంటారు. ఈ దేశానికి ప్రధాన ఆదాయం కేవలం పర్యాటకుల నుంచి వస్తుందంటే నమ్మశక్యంగా లేదు కదా.. అవును అక్కడి ప్రజల జీవనోపాధి పర్యాటకులను ఆకర్షించే పనులు చేయడమే. అంతేకాకుండా వారికి ఇష్టమైన ఆహారాలు విక్రయించడమే. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ దేశం తరచుగా కొన్ని కారణాలవల్ల వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఇంతకీ ఆ కారణాలేంటి పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

ఇటీవల వైరల్ అవుతున్న వీడియోలు, వార్తలు చూస్తే ఎక్కువగా థాయిలాండ్‌కి సంబంధించినవే కనిపిస్తూ ఉన్నాయి.. ముఖ్యంగా సరోగేట్ భార్యల ఆచారంపై వార్తలు కుప్పలు తిప్పలుగా వస్తున్నాయి. థాయిలాండ్‌లోని పట్టాయా ప్రాంతంలో ఈ భార్యలను అద్దెకియ్యడం వంటి ఆచారం ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. భార్య ఆన్ హైర్ పేరుతో సాగుతున్న ఈ వ్యాపారం ప్రస్తుతం నగరాలు దాటుకొని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తూ వస్తోంది. ఈ ఆచారానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. డబ్బులు చెల్లిస్తే తాత్కాలిక వివాహంతో పాటు అమ్మాయి స్వల్ప కాలానికి భార్యగా కూడా కొనసాగుతుందట.. ఈ ఆచారం గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తుందని అక్కడి జనాలు చెబుతున్నారు.

అందుకే వివిధ దేశాల నుంచి థాయిలాండ్ కు విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో నుంచి కొంతమంది అమ్మాయిలు థాయిలాండ్‌లోని పట్టాయా చేరుకుని ఈ అద్దె భార్యను గా మారుతున్నారని ఇటీవలే ఎన్నో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం థాయిలాండ్ లో ఈ వ్యాపారం జోరుగా కొనసాగుతుందట. రెడ్ లైట్ ఏరియా, బార్లు, నైట్ క్లబ్బులకు ఫేమస్ అయిన ప్రాంతాల్లో ఈ బిజినెస్ మూలాలు కూడా ఊహ కందని స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయట.  కొంతమంది మహిళలు కావాలని డబ్బుల కోసం విదేశీ పర్యాటకులకు భార్యలుగా మారుతున్నారని, ఈ సమయంలో అనేక సమస్యలు పడుతున్నారని అక్కడి ప్రజలు చెబుతున్నారు. 

తాత్కాలిక ఒప్పందం ప్రకారం విదేశీ పర్యాటకులకు మారుమూల ప్రాంతాల్లో నుంచి వచ్చిన అమ్మాయిలు భార్యలుగా మారుతున్నారని, డబ్బులు సంపాదించడానికి వారు ఏమైనా చేస్తున్నారని ఇటీవల వార్తల్లో వ్రాస్తూ వచ్చారు. ముఖ్యంగా చాలామంది మహిళలు కుటుంబాలను పోషించేందుకు ఇదే వృత్తిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క తాత్కాలిక భార్యకు దాదాపు 1600 డాలర్ల నుంచి ఒక లక్ష డాలర్ల వరకు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. మహిళల వయసుతోపాటు అందం, విద్యను బట్టి విక్రయాలు కొనసాగుతున్నాయట.. అంతేకాకుండా ఆ ప్రదేశంలోని కొంతమంది పేద విద్యార్థులు కూడా ఇదే వృత్తిని ఎంచుకొని జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారని తెలుస్తోంది..

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News