The fighting between hawks and Lion video: అడవిలో రకరకాల జంతువులు ఉంటాయి. వీటిలో కొన్ని సాధు జంతువులు కాగా, మరికొన్ని క్రూరమైన జంతువులు. సింహలు, పులులు, చిరుతలు, ఏనుగులు రకరకాల జంతువులు ఉంటాయి. అదే విధంగా జింకలు, గేదెలు, వీల్డర్ బీస్ట్ లు మొదలైనవి ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం క్రూర జంతువులు సాధు జంతువులపై తరచుగా దాడులుచేస్తుంటాయి. అడవికి సింహాన్ని రాజుగా చెప్తుంటారు. సింహం గాండ్రిస్తే కొన్ని కిలో మీటర్ల వరకు విన్పిస్తుంది.
అదే విధంగా పొరపాటున సింహం కళ్లలో ఏదైన జంతువు పడితే.. దానికి ఫుడ్ కావాల్సిందే. అయితే.. కొన్ని సందర్భాలలో క్రూరజంతువులు సైతం సాధు జంతువుల్ని చూసి దూరంగా పారిపోతుంటాయి. ఈ క్రమంలో జంతువులు వేటాడిన తర్వాత వాటిని తినేందుకు నక్కలు, గద్దలు కూడా వస్తుంటాయి. సింహలు, పులులు మొదలైన జంతువులు వీటి బారిన పడకుండా తమ ఫుడ్ ను తామే తినేందుకు ప్రయత్నిస్తాయి. కానీ కొన్ని సందర్బాలలో క్రూర జంతువులకు కూడా ఇవి చుక్కలు చూపిస్తుంటాయి.
తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడు ఉంటాడు!
ఈరోజు నీది కావచ్చు కాని రేపు మాత్రం కాదు?#Telangana #BRSSM pic.twitter.com/pc0MVpITtZ— Janardhan Goud (@janardhangoud_t) April 16, 2025
ఈ నేథ్యంలో ప్రస్తుతం అడవిలో పెద్ద సింహానికి కొన్ని గద్దలు చుక్కలు చూపించాయి. అడవిలో సింహాలు వేటాడిన వేట కోసం గద్దలు వచ్చాయి. అప్పుడు సింహం దాన్ని తరిమేస్తుంది. ఇంకా కోపంతో లాభంలేదని సింహంపైన గద్దల గుంపు దాడికి దిగుతుంది. సింహాంను ముప్పుతిప్పలు పెడుతాయి. మొత్తంగా సింహానికి మాత్రం అసలు కదలడానికి కూడా టైమ్ ఇవ్వకుండా అదే పనిగా దాడులుచేస్తాయి. ఈ క్రమంలో సింహంపై దాడిచేస్తున్న ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. కానీ సింహంపై దాడి చేస్తున్న గద్దల వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. కొంత మంది దీన్నిషాకింగ్ గా చూస్తుండగా.. మరికొందరు ఏఐ వీడియో కావచ్చని డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









