Hyderabad: హైదరాబాద్‌లోని శివాలయంలో మరో ఘోరం.. ఏకంగా శివలింగంపై కాలుపెట్టి మరీ.. వీడియో వైరల్..

Jeedimetla Shiva Temple: జీడి మెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న శివాలయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట ప్రవేశించారు. అంతే కాకుండా అక్కడ చోరీకి పాల్పడ్డారు.ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 11, 2025, 12:27 PM IST
  • ఆలయంలో మహఅపచారం..
  • మండిపడుతున్నహిందు సంఘాలు..
Hyderabad: హైదరాబాద్‌లోని శివాలయంలో మరో ఘోరం.. ఏకంగా శివలింగంపై కాలుపెట్టి మరీ.. వీడియో వైరల్..

Theft in jeedimetla lord shiva temple video: హైదరాబాద్ లో ఇటీవల ఆలయాలలో వరుసగా అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కొంత మంది హిందు దేవాలయాలను టార్గెట్ గా చేసుకుని ఘోరాలకు పాల్పడుతున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఒక వ్యక్తి కాలితో తన్ని, అమ్మవారిని అవమానించి ఘటన దుమారంగా మారిన విషయం తెలిసిందే.

Add Zee News as a Preferred Source

ఆ తర్వాత కూడా హైదరబాద్ చుట్టుపక్కల కూడా అనేక చోట్ల టెంపుల్స్ లలో దేవుడి విగ్రహాలకు అపచారాలు జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.ఈ నేపథ్యంలో దీనిపై ఇప్పటికే హిందు సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండి పడుతున్నాయి.

 

పోలీసులు ఒక వర్గం వారికి కొమ్ముకాస్తున్నాయని కూడా చెప్పారు. అంతేకాకుండా.. హిందు దేవాలయలపై దాడులు జరుగుతున్న, దేవాలయ ప్రాంగణంలో ఘోరాలు జరుగుతున్న పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని కూడా హిందు సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో హైదరబాద్ లోని జీడిమెట్ల పరిధిలోని శివాలయంలో  మరో షాకింగ్ ఘటన వైరల్ గా మారింది.

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాంధీ నగర్ లో ఒక శివుడి దేవాలయం ఉంది.  ఈ నేపథ్యంలో.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి దేవాలయం లోకి ప్రవేశించి భీబత్సం సృష్టించారు. రాత్రి పూట శివాలయంలో ప్రవేశించి.. అక్కడున్న వెండి వస్తువుల్ని, కాస్లీ వస్తువుల్ని చోరీలు చేశారు. ఏకంగా శివుడి లింగం మీద కాలు పెట్టి మరీ నిలబడి.. పైన దాచిపెట్టిన కొన్నివెండి వస్తువుల్ని దోచుకున్నారు.

ఈ క్రమంలో తెల్లవారు జామున పూజారీ వచ్చి చూడగా.. దేవాలయం తలుపులు తెరిచి ఉండటం, మొదలైనవి చూసి వెంటనే ఆలయ కమిటీకి,పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో ఆగంతకులు చోరీకి పాల్పడిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరొవైపు దుండగుడు శివలింగంపై కాలుపెట్టి చోరికి పాల్పడిన ఘటన అక్కడున్న సీసీకెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Read more: Cat Burn alive: అత్యంత ఘోరం.. పిల్లి ఎదురొచ్చిందని సజీవంగా దహనం చేసిన మహిళలు.. ఎక్కడంటే..?

దీనిపై స్వామి వారి భక్తులు మండిపడుతున్నారు.శివయ్యకు అపచారంచేయడమే కాకుండా.. తమ మనోభావాలు దెబ్బతీసేలా సదరు వ్యక్తులు ప్రవర్తించారని కూడా మండిపడుతున్నారు. వెంటనే వారిని పట్టుకుని కఠినంగా పనిష్మెంట్ చేయాలని కూడా హిందు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News