Mauritania: దీనమ్మ జీవితం.. మార్కెట్ అంటే ఇదే.. అబ్బాయిల కోసం అమ్మాయిలు అమ్ముడు పోవడానికి క్యూ కడతారు!

Shocking Facts About Mauritania: మారిటేనియా అనేది ఉత్తర ఆఫ్రికాలోని ఒక దేశం. ఈ దేశంలో అబ్బాయిల కోసం విడాకులు తీసుకున్న మహిళలు క్యూ కడతారు. పూర్తి వివరాలు తెలుసుకోండి. 

Written by - Shashi Maheshwarapu | Last Updated : Dec 10, 2024, 11:57 PM IST
Mauritania: దీనమ్మ జీవితం.. మార్కెట్ అంటే ఇదే.. అబ్బాయిల కోసం అమ్మాయిలు అమ్ముడు పోవడానికి క్యూ కడతారు!

Shocking Facts About Mauritania: నేటికాలంలో విడాకులు తీసుకుంటూ పార్టీ చేసుకున్న జంటలను మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అమ్మాయిలు ఏదో బరువు తీరిపోయింది అన్నట్టు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు.  అయితే పెళ్లైన ఆడవాళ్ళను మార్కెట్లో అమ్మకానికి పెట్టే మార్కెట్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? వింతగా ఉంది కాదా.. కానీ ఈ మార్కెట్‌ మారిటేనియా దేశంలో ఉందని మీకు తెలుసా? అసలు ఈ మార్కెట్‌ ఎంటి? అనే వివరాలు తెలుసుకుందాం. 

మారిటేనియా అనేది ఉత్తర ఆఫ్రికాలోని ఒక దేశం. అట్లాంటిక్ మహాసముద్రం తీరాన ఉన్న ఈ దేశం సహారా ఎడారితో చుట్టుముట్టబడి ఉంది. ప్రధానంగా అరబిక్, ఫ్రెంచ్ భాషలు మాట్లాడే ఈ దేశంలో ఇస్లాం మతం ప్రబలంగా ఉంది.  ఈ దేశ కరెన్సీ మన ఇండియన్ కరెన్సీ కంటే కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. అయిన కూడా ఇది ప్రపంచంలోనే అత్యంత పేద దేశం. మారిటేనియాలోనే అత్యంత పెద్ద నగరం ఆర్థికంగా సాంస్కృతికంగా కూడా ఈ రాజధాని నగరమే నిలయం. కానీ 1960లో ఈ దేశానికి కూడా స్వతంత్రం లభించింది ఫ్రాన్స్ నుంచి స్వాతంత్రం సంపాదించుకునే 64 సంవత్సరాలు గడిచిపోయాయి . అయినప్పటికీ కూడా ఇక్కడ బానిసత్వం నిలిచే ఉంది దాదాపు 6 లక్షల మంది ఎప్పటికీ కూడా బానిసలుగా బతుకుతూ ఉన్నారు.  

అయితే మారిటేనియాలో పెళ్లైన ఆడవాళ్ళను మార్కెట్లో అమ్మకానికి పెడతారు ఇక్కడ డ్రైవర్స్ మార్కెట్ అని ఒక మార్కెట్ ఉంది. పెళ్లైన ఆడవాళ్లు విడాకులు తీసుకుని ఎన్ని పెళ్లిళ్లు అయినా ఇక్కడ చేసుకోవచ్చు.  ఇక్కడ ఆడవాళ్లు పెళ్లిళ్లు చేసుకుంటారు కానీ భర్త దగ్గరకు వెళ్ళిన తర్వాత విడాకులు చాలా వేగంగా తీసుకుంటూ ఉంటారు. కానీ నిజానికి విడాకులు తీసుకోవడం మన దేశంలో తప్పుగా భావిస్తూ ఉంటారు. ఈ దేశంలో మాత్రం విడాకులు తీసుకున్న తర్వాత ఎన్నో సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఈ మార్కెట్ మౌరిటీ రాజధాని నగరంలో నిర్వహిస్తూ ఉంటారు ఈ దేశంలో మగవాళ్ళు కన్నెపిల్లలను పెళ్లి చేసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. పెళ్లైన ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే పడక సుఖమన్నవ్వని మగవాళ్ళ నుంచి మాత్రమే ఆడవాళ్లు విడాకులు తీసుకుంటారు అనే వాళ్ళ అభిప్రాయం కాబట్టి అటువంటి విడాకులు తీసుకున్న మహిళలను పెళ్లి చేసుకోవడమే ఈ దేశంలో ఉన్న మగవాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు     

ఆడవాళ్ళందరూ పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత ఆ జంట మూడు రోజులపాటు గది నుంచి బయటకు రారు. ఒక్కొక్కసారి వారంపాటి గదిలోనే ఉండిపోతారు.  ఈ దేశంలో ఉన్న మగవాళ్ళ అభిప్రాయం ప్రకారం, విడాకులు తీసుకున్న ఆడవాళ్లు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ పెళ్లయింది కాబట్టి వాళ్లకి ఎంతో ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందని భావిస్తారు. ఈ దేశంలో ఉన్న సాంప్రదాయాల ప్రకారం విడాకులలో ప్రత్యేక దృష్టితో చూస్తారు. విడాకులనేవి వాళ్లకు చాలా సాధారణ విషయం. విడాకుల తీసుకున్న తర్వాత ఆడవాళ్లు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నిటిని తీసుకుని బజారుకు వచ్చి అమ్ముకొని డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఒక మహిళ విడాకుల తీసుకుంది అంటే ఆమె బంధువులతో పాటు స్నేహితులకు కూడా ఎంతగానో సంతోషిస్తారు. ఇక్కడ ఆచారం ప్రకారం విడాకులనేవి సిగ్గుపడే విషయం కాదు నిజానికి ఇది చాలా సంతోషించాల్సిన విషయం అని వాళ్ళు భావిస్తారు.

ఈ ఆడవాళ్లకు పిల్లలు ఉంటే ఆ పిల్లల బాధ్యత కూడా వాళ్ళను కొత్తగా పెళ్లి చేసుకున్న మగవాళ్ళదే. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే విడాకులు తీసుకున్న వెంటనే ఇక్కడ ఆడవాళ్లకు పెళ్లి అయిపోదు. కొత్త పెళ్లికి విడాకులకే మధ్య మూడు నెలల సమయం ఉండాలి ఇదే అక్కడ నియమం . ఇలాంటి నియమం విధించడానికి కారణం ఒకవేళ ఆ మహిళ ప్రెగ్నెంట్ అయిందో లేదో తెలుసుకోవాలి అని వాళ్ళు భావిస్తారు. ఒకవేళ ఆ మహిళ ప్రెగ్నెంట్ అవ్వకపోతే ఆమెకు తొందరగానే పెళ్లయిపోతుంది. ఒకవేళ ఆ మహిళ ప్రెగ్నెంట్ అయితే ఆమె పెళ్లిలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆమెకు పెళ్లి అవ్వడం కూడా చాలా కష్టం. ఈ నియమాల వల్ల అక్కడ మహిళలు ఎంతో స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటారు. మిగిలిన ఇద్దరు ఇస్లామిక్ దేశాలలో ఆడవాళ్ళ మీద ఎన్నో ఆంక్షలు ఉంటాయి. కేవలం మగవాళ్ళు మాత్రమే మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవచ్చు. కానీ ఆడవాళ్లు ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడానికి వీలు ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ఆడవాళ్లు ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు. అందుకనే అలాంటి ఒత్తిడి లేకుండా ఇక్కడ ఆడవాళ్లు ఫ్రీగా జీవిస్తూ ఉంటారు. 

Also Read: Ram Gopal Verma: నా అరెస్ట్‌పై మీకు ఎందుకు తొందర.. కేసులపై న్యాయ పోరాటం చేస్తా'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News