)
Three cobra snakes fighting Each other Video: సాధారణంగా మనలాగే పాములు కూడా ఫైటింగ్ చేస్తుంటాయి. అవి కూడా ఆడతోడు కోసం, ఆవాసం కోసం ఫైటింగ్ కు దిగుతాయని చెబుతుంటారు. ఆడపాము మెటింగ్ కు అనుకూలంగా ఉన్నప్పుడు దాని శరీరంనుంచి ఒక ప్రత్యేకమైన సువాసన రసాయనాల్ని బైటకు వెదజల్లుతుందంట. అది ఐదు కిలో మీటర్ దూరంగా ఉన్న మగ పాముల్ని కూడా వాటివైపు ఆకర్శిస్తుందంట.
దీంతో కుప్పలుగా మగ పాములు ఆడపాముతో సంభోగం చేయడానికి వస్తాయంట. అప్పుడు పాములు తమలో తాము పోట్లాడుకుని.. గెల్చిన పాము మాత్రంమే ఆడపాముతో సంభోగం జరుపుతుందని చెప్తుంటారు. అయితే.. పాముల వీడియోలు తరచుగా నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి.
నెటిజన్లు సైతం ఇటీవల పాముల వీడియోల్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి. మరీ పాములంటే వాళ్లకు ఎందుకంత నచ్చుతున్నాయో కానీ.. మొత్తంగా పాముల వీడియోలు తెగ ట్రెండింగ్ లో ఉంటున్నాయి. చాలా మంది పాముల్ని చూడగానే దూరంగా వెళ్లిపోతారు. మరికొందరు పాములకు అస్సలు అపకారం చేయోద్దని చెబుతుంటారు. పాములకు చెడు చేస్తే కాలసర్పదోషాలు చుట్టుకుంటాయని పండితులు చెబుతుంటారు.
అందుకే చాలా మంది పాములు కన్పిస్తే.. వెంటనే స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇస్తారు. కానీ మరికొందరు మాత్రం పాముల పట్ల సైకోలుగా కూడా ప్రవర్తిస్తుంటారు. తాజాగా.. మూడు పాములు ఫైటింగ్ కు దిగిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
దీనిలో మూడు పాములు కూడా ఒకదానివైపు మరోకటి కోపంతో చూసుకుంటూ, పడగ విప్పి మరీ కోపంగా నువ్వెంత అంటే.. నువ్వెంత అన్న చందంలా కళ్లలో కళ్లు పెట్టుకుని మరీ కోపంగా చూసుకుంటున్నాయి. మరీ ఆ పాములు ఆడ తోడు కోసం పొరాటానికి దిగాయో లేదా ఆవాసం కోసం యుద్దంకు దిగాయో కానీ.. ఒక దాని మీదకు మరోకటి పడగ విప్పి మరీ కాటులు వేసుకుంటూ యుద్దానికి దిగాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.