Three Headed Cobra Viral Video Watch Now: మనం సోషల్ మీడియాలో ఎన్నో రకాల పాముల వీడియోలు ఇప్పటివరకు చూసి ఉన్నాం.. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో అన్ని పాముల వీడియోల కంటే భిన్నంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇంతవరకు చూసిన పాముల తల కేవలం ఒక పాముకు ఒకతల మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలు ఒక పాముకు ఏకంగా మూడు తలలున్నాయి. ఈ వీడియో చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. పాముకు మూడు తలలేంటని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ పాము కు సంబంధించిన వీడియో నిజమేనా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మనం తరచుగా ఎన్నో రకాల పాములను చూస్తూ ఉంటాం. ఇందులో చాలావరకు విషపూరితమైనవే.. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న పాముకు మూడు తలలున్నాయి. సాధారణంగా మూడు తలలు కలిగిన పాములు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. జన్యుపరమైన లోపాల కారణంగా లేదా ఇతర కారణాలవల్ల మూడు తలల పాములు, రెండు తలల పాములు పుడుతూ ఉంటాయి. కొన్ని రకాల అరుదైన జాతులకు సంబంధించిన పాములు కూడా ఇలా మూడు తలలు కలిగి ఉంటాయని సమాచారం. కానీ ఈ వీడియోలో వైరల్ అవుతున్న మూడు తలల నాగుపామును చూస్తే ఆశ్చర్యమేస్తోంది.
వీడియో వివరాల్లోకి వెళితే.. రోడ్డుపై మూడు తలల నాగుపాము పడక విప్పి వస్తున్న కారువైపు చూడడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా కార్లో ఉన్న వారు కూడా ముందుగానే పాము ఉందని గమనించి అక్కడికక్కడే ఆగిపోవడం కూడా చూడొచ్చు. నిజానికి ఈ వీడియోలో కనిపిస్తున్న పాము నలుపు రంగులో చూడడానికి అచ్చం నాగుపాముల కనిపిస్తోంది. మూడు తలలు కలిగిన నాగుపాము తన తలను అటు ఇటు ఊపడం కూడా చూడొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది ఈ వీడియోని చూసి కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇది నిజమైన పాము కాదని AI సృష్టించిన పాముగా చెప్పుకుంటున్నారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









