)
Three Headed King Cobra Viral Video: గతంలో మనం సోషల్ మీడియాలో రెండు తలల పాములకు సంబంధించిన వీడియోలు ఎన్నో చూసి ఉన్నాం.. అంతేకాకుండా ఒక శరీరం ఒకే వైపు రెండు తలలో ఉన్న పామును కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చూసాం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మూడు తలల పాము కు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన మూడు తలల నాగుపామును కళ్లకు కట్టినట్లు చూడొచ్చు. అయితే, ఈ పాముకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ వీడియోను ట్రైబ్ షార్టర్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. దీనిని real 3 head snake? dekh lo అనే క్యాప్షన్ పెట్టి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని లక్షల మందికి పైన సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. ఈ ఆరు సెకండ్లు కలిగిన వీడియోను చూసిన చాలామంది వన్యప్రాణి సంరక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఒకే పాముకు వివిధ తలలు ఉండడాన్ని పాలిసెఫాలీ అని పిలుస్తారు.. అత్యంత అరుదైన జన్యు లోపం కారణంగా ఇలా ఒకే పాముకు వివిధ తలలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను చూసి వన్యప్రాణి సంరక్షకులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇలాంటి పాములు ఎప్పుడూ చూడలేదని.. ఇలా చూడడం చాలా అరుదని వారు అంటున్నారు. కొంతమందైతే ఈ వీడియో చూసినవారు ఇది నిజమైన వీడియో కాదని.. ఎవరో కావాలనే గ్రాఫిక్స్ చేసి ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెబుతున్నారు. అయితే, ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలు పాము గుళ్లో ఉండడం ఆశ్చర్యమేస్తోంది.
ఇప్పటికీ పాము గుళ్లో తిరగడం, శివలింగంపై పామదర్శనం ఇవ్వడం వంటి అనేక రకాల వీడియోలు చూసాం. అయితే, ఈ వీడియోలో మూడు తలలు కలిగిన పాము గుళ్ళో కనిపించడం చాలామందికి ఆశ్చర్యమేస్తోంది. ఈ వైరల్ అవుతున్న వీడియోను ఇప్పటివరకు కొన్నివేల మందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను యూట్యూబ్‌లోనే కాకుండా అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ కూడా అవుతోంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook