)
Tiger Viral Video Now: పులులు ఎంత ప్రమాదకరము మనందరికీ తెలుసు.. ఇవి చూడడానికి గంభీరంగా కనిపిస్తూ ఉంటాయి. వీటి దగ్గరికి వెళ్లేందుకు కూడా ఎవరు ఇష్టపడరు. పులి సంచారం చేసిందని తెలిసి గ్రామాలకు గ్రామాలే ఖాళీ చేసిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. చాలామంది సోషల్ మీడియాలో పులులకు సంబంధించిన వీడియోలు చూసి కూడా ఎంతో భయపడుతూ ఉంటారు. అలాంటి భయానకం కలిగించే ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన చాలామంది వామ్మో అంటున్నారు. నిజానికి ఈ వీడియోలో ఏముందో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బోనులో ఉన్న పులిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు.. పులి ఎక్కడన్నా పులే.. ఆహారం కోసం ఎంత పెద్ద జంతువునైన ఎంతో సులభంగా దాడి చేసి చంపుకుని తింటుందని తెలిసిన ఓ యువ వైద్యురాలు పులి బోనులోకి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాలనుకుంది. ఇందులో భాగంగానే ఆ యువ డాక్టర్ పులి బోనులోకి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది. అయితే, ఇదే సమయంలో ఆగ్రహానికి గురైన పులి ఆ యువ డాక్టర్ మెడపై నిలబడి రెండు కాళ్లను తనపై ఉంచుతుంది. దీంతో ఆమె ఒక్కసారిగా కేకలు వేయడం ప్రారంభిస్తుంది. వెంటనే అక్కడికి జూ సిబ్బంది చేరుకొని పులినుంచి రక్షించేందుకు ప్రయత్నిస్తారు.
ఈ వైరల్ అవుతున్న వీడియోను 'Jam.Pressjourno' అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఈ వీడియోలో ఆ యువ డాక్టర్ మంచి చేయాలని పోయి.. తన ప్రాణాలనే పోగొట్టుకునే స్థితికి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను అక్కడే ఉన్న కొంతమంది జూ సిబ్బంది మొబైల్లో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా అయ్యో పాపం అని అంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook