Tiger attacks on old man ai generated video: సోషల్ మీడియాలో ప్రతిరోజు బోలేడు వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. ఇటీవల ఏఐ , డీప్ ఫెక్ పుణ్యామా..అని ఏ వీడియోలు నిజమో .. మరే వీడియోలు ఫెకో కూడా అర్థంకాని సిట్యువేషన్ ఏర్పడింది. మొత్తంగా ప్రస్తుతం పాముల వీడియోలు నెట్టింట ట్రెండింగ్ గా మారాయి.అంతే కాకుండా ఇటీవల పులులు, చిరుత పులుల వీడియోలు ఎక్కువగా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో ఇటీవల ఒక పెద్దపులి ఇంటి బటై కూర్చుని ఉన్న ఒక వ్యక్తిపై దాడి చేసి అతడ్ని అడవిలో లాక్కెళ్లిపోయింది. ఈ వీడియో విపరీతంగా వైరల్ గా మారింది. అయితే.. ఇది ఫెక్ వీడియో , ఏఐ వీడియో అని ఆలస్యంగా తెలిసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. అది చూస్తుంటే ఎవరి కైన తొలుత నిజమని పిస్తుంది.
అడవికి దగ్గరగా ఉన్న నివాసాల్లో తరచుగా పులులు, చిరుతలు, ఎలుగు బంట్లు, వస్తుంటాయి. రాత్రిపూట అవి వేటాడుతాయని విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ పెద్దపులి మనిషిపై దాడి చేసి అడవిలో లాక్కెళ్లిన వీడియో వైరల్ గా మారింది.
ఈ క్రమంలో నెట్టింట అదే ఏఐ ను ఉపయోగించి కొంత మంది లాక్కెళ్లిన మనిషిని మరల పులి.. అదే స్థానంలో వలిలేసి వెళ్లినట్లు మరో వీడియోను సోషల్ మీడియాలో కొంత మంది క్రియేట్ చేశారు. ఇది ప్రస్తుతం వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మీ పైత్యం పీక్స్ కు చేరింది రా నాయన.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.









