)
Man Kissed Tiger Video Watch Here: సాధారణంగా క్రూరముగాలంటేనే అందరి ఎంతో భయపడి వాటికి దూరంగా ఉంటారు. అలాగే కొంతమంది పెంచుకున్నవని తెలిసి దగ్గరికి వెళ్లేందుకు ఇష్టపడరు. కానీ ఇటీవల వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఎలాంటి భయం లేకుండా సరదాగా పులితో గడుపుతున్న సన్నివేశాలు వైరల్ గా మారుతున్నాయి. చాలా అరుదుగా కనిపించే ఇలాంటి పులులతో మనుషులు గడపడం చాలా అరుదు కాబట్టి ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది అయితే ఈ వీడియోని చూసి ఆ వ్యక్తి నిజంగా ఇలా చేశాడా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి పులి ఉన్న బోనులోకి నేరుగా ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ముఖం నేలపై చాటేసి పడుకున్న పులి మెడ పట్టుకొని పైకి లేపి మరి దానికి ముద్దులు ముద్దులు పెట్టడం వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా ఆ వ్యక్తి పులి దగ్గరే ఎంతో హాయిగా గడపడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ వ్యక్తి అక్కడే దాదాపు 5 నిమిషాలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు..
ఈ వీడియోను @wild_animalsgram అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి మార్చి 31వ తేదీన సోషల్ సోషల్ మీడియాకు వదిలారు.. అప్పటినుంచి ఇప్పటివరకు పదివేల మందికి పైగా లైక్ చేశారు. అంతేకాకుండా చాలామంది ఈ అద్భుతమైన వీడియో నమ్మసక్యంగా లేదని కామెంట్లు రాస్తున్నారు. కొంతమంది అయితే ఇది ఫేక్ వీడియో అని, ఏఐ జనరేట్ చేసిందని చెబుతున్నారు.
మరి కొంతమంది అయితే "అదొక పెద్ద అడవి జంతువు.. అది కోరుకుంటే ఆ మనిషిని క్షణాల్లోనే చంపగలరు..కానీ ఈ వీడియోలో ఎందుకు ప్రశాంతంగా ఫీల్ లా ఉంది? "అని ఓ సోషల్ మీడియా వినియోగదారుడు కామెంట్ రాశాడు. "మీకు ఎంతమంది స్నేహితులు ఉన్న..ఒక అడవి జంతువుతో స్నేహం చేయడం అది ఎప్పటికైనా ప్రమాదకరమే" అని మరొక సోషల్ మీడియా వినియోగదారుడు కామెంట్ చేశాడు. ఆ పులితో స్నేహం చేయడం నీ మూర్ఖత్వం అని మరొకరి కామెంట్ చేశారు..ఇలా చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేశారు.
అడవిలో జంతువులతో సరదాగా గడపడం ఎల్లప్పుడూ అంత మంచిది కాదు. ముఖ్యంగా చాలామంది బోన్ లోకి వెళ్లి మరి ఫోటోలు దిగుతూ ఉంటారు. అయితే ఇలాంటి సందర్భాలు ఎప్పటికైనా ప్రమాదకరమైన ఘటనలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పులులు, సింహాలకు సంబంధించిన స్వభావం ఎల్లప్పుడూ ప్రమాదకరమైననని కొంతమంది చెబుతున్నారు. కాబట్టి వీటితో స్నేహం చేసే క్రమంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు అంటున్నారు. చాలామంది ఈ వీడియోని చూసి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి