Tortoise catchers water snake video: సాధారణంగా పాములు చాలా వరకు విషపూరితంగా ఉంటాయి. ముఖ్యంగా పాములకు చెందిన వింత వింత వీడియోలు ఇటీవల నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం పాముల వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పాములు అడవుల్లో , గుబురుగా చెట్లు ఉన్న ప్రదేశాల్లో సంచరిస్తుంటాయి.
అయితే.. పాములకు గద్దలు, ముంగీసలు బద్ద శత్రువులుగా చెప్పుకొవచ్చు. మొత్తంగా కోబ్రాల్ని ఇవి వేటాడి చంపేస్తాయి. అడవిలో ఉన్న క్రూర జంతువులు సైతం పాములకు భయపడిపోతుంటాయి. కోబ్రాలు తమ నోటితో విషాన్ని వెదజల్లుతుంటారు.
I had no idea turtles eat snakes ? pic.twitter.com/95SScig6mO
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) May 1, 2025
దీనివిషయం కొన్ని మీటర్ల వరకు కూడా ఎగిరి పడుతుంది. భూమి మీద ఉండే పాములు కాకుండా.. సముద్రంలో ప్రత్యేకంగా కొన్నిపాములు ఉంటాయి. ఇవి నీటిలోనే ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక తాబేలు.. నీటిలో ఉన్న పామును గుటుక్కున మింగేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
నీటిలో ఉన్న భారీ తాబేలు.. అక్కడున్న ఒక పామును చూసింది. అది వెంటనే దాని దగ్గరకు వెళ్లింది. పాము చూస్తుండగానే.. తాబేలు దగ్గరకు వచ్చి పామును మింగేసింది. పాపం.. పాము తాబేలు నోటిలో నుంచి విడ్పించుకోలేక విలవిల్లాడిపోయింది.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు బాప్ రే... పాముకు చుక్కలు చూపించిందిగా అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









