Snake Video: ఓర్నాయనో... ఏకంగా బీరువాలో సయ్యాటలాడుతున్న రెండు నాగు పాములు.. అరుదైన వీడియో..

Snake found in almairh video: రెండు సర్పాలు బీరువాలో హల్ చల్ చేశాయి. దీంతో ఇంటి ఓనర్ షాక్ అయ్యి వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చాడు.ఈ వీడియో వైరల్గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు ఇదెక్కడి రచ్చరా అంటూ షాక్ అవుతున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Nov 6, 2025, 04:17 PM IST
  • బీరువాలో నాగు పాములు..
  • వీడియో వైరల్..
Snake Video: ఓర్నాయనో... ఏకంగా బీరువాలో సయ్యాటలాడుతున్న రెండు నాగు పాములు.. అరుదైన వీడియో..

Cobra Snakes found in almairh video geos viral: సోషల్ మీడియాలో పాముల వీడియోలు నిత్యం వందల కొద్ది వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు ఇటీవల ప్రత్యేకంగా కోబ్రాల వీడియోలను ఆసక్తిగా తిలికిస్తున్నారు. దీంతో పాముల వీడియోలకు డిమాండ్ బాగాపెరిగింది.  దీంతో ప్రతిరోజు ఎక్కడ ఎలాంటి పాముల వీడియోలు కన్పించిన కూడా నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. దీంతో అవి కాస్త వైరల్ గా మారుతాయి. ఎక్కడైన పాములు కన్పిస్తే  వెంటనే కొంత మంది స్నేక్ క్యాచర్ లకు సమాచారం ఇస్తారు.

Add Zee News as a Preferred Source

 

మరికొంత మంది పాములతో ఆడుకుంటారు. ఏమాత్రం భయంలేకుండా స్టంట్ లు చేస్తారు.  ముఖ్యంగా వానాకాలంలో పాములు ఇళ్లలోకి వస్తాయి. బండ్లలో, బూట్లలో దూరి నక్కి ఉంటాయి. కొన్నిసార్లు ఇవి కాటు వేస్తాయి.  దీంతో వానాకాలంలో పాములతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతారు.

తాజాగా.. రెండు పాములు ఏకంగా బెడ్ రూమ్ లోని బీరువాల్లోకి దూరి సయ్యాటలాడాయి.  వైరల్ గా మారిన వీడియోలో రెండు పాములు బీరువాలోకి ఎక్కి కూర్చున్నాయి. అంతే కాకుండా.. అవి సయ్యాటలాడుతున్నాయి. మరీ ఆ బీరువా ఓపెన్ ఎలా ఉంచారో.. లేదా.. ఆ గది చెట్లకు, పొదలకు దగ్గరగా ఉందో తెలీదు కానీ.. మొత్తంగా రెండు పాములు బీరువాలో ఎక్కి కూర్చున్నాయి.

అంతటితో ఆగకుండా బుసలు కొట్టుకొంటూ సయ్యాటలాడుతున్నాయి. ఇంటి ఓనర్ పాముల్ని చూసి వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చాడు. వెంటనే రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ పామును ఎంతో చాకచక్యంగా పట్టుకున్నాడు.

Read more: Python In Tirumala Video: గుండెలు గుభేల్.. తిరుమల ఘాట్‌ రోడ్డులో భారీ కొండ చిలువ.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..

మొత్తంగా ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.  మరోవైపు పాములు అక్కడికి ఎలా వెళ్లాయ్ రా బాబు.. అంటూ డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News